జాతీయ వార్తలు

బంపర్ ఆఫర్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలో ఏడవ వేతన కమిషన్ చేసిన సిఫారసుల కంటే అధిక మొత్తంలో వేతనాలను అందుకోనున్నారు. ఏడవ వేతన కమిషన్ సిఫారసులపై సమీక్ష జరిపిన కార్యదర్శుల గ్రూపు ఇప్పటికే తమ నివేదికను సిద్ధం చేసినట్లు తాజా వార్తలు స్పష్టం చేస్తున్నాయి. వేతన కమిషన్ సిఫారసుల కంటే కేంద్ర ఉద్యోగులకు అధిక మొత్తంలో జీతభత్యాలు ఇవ్వాలని ఈ గ్రూపు తమ నివేదికలో సిఫారసు చేయడం ఆశ్చర్యకరమైన అంశం. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టిచూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది జూన్-జులై నాటికే భారీ మొత్తంలో వేతనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగువ స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు ఉద్యోగుల వేతనాలను రూ.2.70 లక్షల నుంచి రూ.21 వేల మధ్య పెంచాలని కార్యదర్శుల గ్రూపు తమ నివేదికలో సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఎగువ స్థాయి ఉద్యోగులకు సంబంధించి ఏడవ వేతన కమిషన్ సిఫారసు చేసిన గరిష్ఠ వేతన పరిమితి కంటే ఇది రూ.20 వేలు, దిగువ స్థాయి ఉద్యోగుల వేతన పరిమితి కంటే ఇది రూ.3 వేలు ఎక్కువ.
ఏడవ వేతన కమిషన్ సిఫారసులపై అధ్యయనం చేసేందుకు క్యాబినెట్ సెక్రటరీ పికె.సిన్హా నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. దీంతో 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మరో 52 లక్షల మంది పెన్షనర్ల వేతనాలపై ఈ కమిటీ సమీక్ష జరిపి నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి 2016 జనవరి 1వ తేదీ నుంచి కొత్త వేతన స్కేళ్లను అమలులోకి తీసుకొస్తే ఖజానాపై అదనంగా రూ.1.02 లక్షల కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.