జాతీయ వార్తలు

ఆ రైల్లో సౌకర్యాలు ఎనె్నన్నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ముంబయి-గోవా మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులు త్వరలో సకల సదుపాయాలు అనుభవించనున్నారు. సాధారణంగా విమానాల్లో లభించే సెలబ్రిటీ చెఫ్‌లు వండిన ఆహారం, టీ, కాఫీ వెండింగ్ మిషన్లు, వ్యక్తిగత ఎల్‌సిడి టీవీలు లాంటివి ఇకపై ఈ మార్గంలోని రైల్లో ప్రయాణికులకు లభించనున్నాయి. అన్ని సదుపాయాలతో కూడిన అత్యధునాతన రైలు సర్వీస్‌ను రైల్వేలు వచ్చే జూన్‌నుంచి ముంబయి-గోవా మార్గంలో ప్రవేశపెట్టబోతోంది. 20 బోగీలుండే ఈ తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో అన్ని బోగీలకు ఆటోమేటిక్ డోర్‌లు, పూర్తి భద్రత కలిగిన గ్యాంగ్‌వేలు ఉంటాయి. భారతీయ రైల్వేలో ఇలాంటి సదుపాయం ఉండే తొలిరైలు ఇదే అవుతుంది. ప్రస్తుతం ఆటోమేటిక్ డోర్లు కేవలం మెట్రో రైళ్లలో మాత్రమే ఉండగా, బోగీల మధ్య ఉండే గ్యాంగ్‌వేలు, కారిడార్లు ఇరువైపులా మూసి ఉండవు.
ముంబయి-గోవా మార్గంలో నడిచిన తర్వాత తేజస్ రైలు సర్వీసును ఢిల్లీ-చండీగఢ్ మార్గంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తేజస్ రైలు సర్వీసును ప్రవేశపెట్టనున్నట్లు ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ప్రీమియం క్లాస్ రైలు అయినందున కాఫీ, టీ వెండింగ్ మెషన్లు, మ్యాగజైన్లు, స్నాక్స్ టేబుళ్లు లాంటి అనేక సదుపాయాలు ఇందులో లభిస్తాయని రైల్వే శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఈ సదుపాయాలే కాకుండా బయో టాయిలెట్లలో వాటర్ లెవల్ ఇండికేటర్లు, సెన్సార్ సాయంతో పనిచేసే కుళాయిలు, చేతుల తడిని తుడుచుకోవడానికి హ్యాండ్ డ్రైయర్లులాంటివి కూడా ఉంటాయని ఆ అధికారి చెప్పారు. ఇవేకాకుండా ప్రతి బోగీలోను వై-ఫై సదుపాయం, టాయిలెట్ ఎంగేజ్‌మెంట్ బోర్డులు లాంటివి ఉంటాయి. ప్రయాణికులు వరల్డ్‌క్లాస్ రైల్లో ప్రయాణిస్తున్న అనుభూతిని పొందడానికి వీలుగా బోగీలోపల రంగులు బైటి రంగుకు మ్యాచ్ అయ్యే విధంగా కూడా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల కాలక్షేపంకోసం ఉపయోగ పడే ఎల్‌సిడి టీవీలను ప్రయాణికులకు సంబంధించిన సమాచారాన్ని, సేఫ్టీ చర్యలు లాంటివి తెలియజేయడానికి కూడా ఉపయోగించుకుంటామని రైల్వే అధికారి చెప్పారు. తేజస్ రైలు బోగీల్లో ఇంటిగ్రేటెడ్ బ్రెయిలీ డిస్‌ప్లేలు, గమ్యస్థానాలను తెలియజేసే డిజిటల్ బోర్డులు, ఎలక్ట్రానిక్ ప్రయాణికుల రిజర్వేషన్ చార్ట్‌లులాంటి సదుపాయాలు కూడా ఉంటాయి. క్యాటరింగ్ సర్వీస్ చార్జీలు రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లతో సమానంగా ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్‌కార్లు ఉండే తేజస్ రైలు బోగీల్లో 22 సరికొత్త ఫీచర్లు ఉంటాయని, ఇంటర్-సిటీ సర్వీసులలో ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ రైలు సర్వీస్‌ను ప్రవేశపెట్టడం వెనుక ఉద్దేశమని ఆ అధికారి చెప్పారు.