జాతీయ వార్తలు

రాజ్యసభ సభ్యత్వానికి మాల్యా రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా సోమవారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. దేశంలోని వివిధ బ్యాంకులకు ఉద్ధేశ్యపూర్వకంగా దాదాపు 9 వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశానికి పారిపోయిన మాల్యా ఈ వ్యవహారంలో రాజ్యసభ హక్కుల కమిటీకి సమాధానం ఇవ్వాల్సిన గడువు ముగియడానికి ఒక రోజు ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది. విజయ్ మాల్యా సభ్యత్వాన్ని రద్దు చేయాలని గత నెల 25వ తేదీన జరిగిన సమావేశంలో రాజ్యసభ హక్కుల కమిటీ ఏకగ్రీవంగా సిఫారసు చేయడంతో పాటు ఈ విషయమై సమాధానమిచ్చేందుకు ఆయనకు వారం రోజుల గడువు ఇచ్చిన విషయం విదితమే. దీంతో మాల్యా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. కమిటీ మంగళవారం సమావేశం కానున్న తరుణంలో ఆయన లండన్ నుంచి తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి పాంపాడు. ఆయన సభ్యత్వ గడువు జూన్ 30వ తేదీతో ముగియనుంది.