జాతీయ వార్తలు

చుక్కలు చూపిన ‘నీట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: మూడు రోజుల క్రితం దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షల్లో విద్యార్థులకు చుక్కలు చూపించారు. డ్రెస్‌కోడ్ పేరుతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కేరళలో అయితే ఏకంగా లోదుస్తులు తొలగిస్తేగానీ విద్యార్థినిని పరీక్షకు అనుమతించలేదు. ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షను ఆదివారం నిర్వహించింది. ప్రతిష్టాత్మంగా నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్‌గానీ, అవకతవకలు గానీ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే కొన్నిచోట్ల ఇన్విజిలేటర్లు అతిగా ప్రవర్తించారని బోర్డుకు ఫిర్యాదులు అందాయి. డ్రస్‌కోడ్‌ను కారణంగా చూపి విద్యార్థులను విపరీతమైన వత్తిళ్లకు గురిచేశారు. ‘కేరళలోని కన్నూర్‌లో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. నిర్వాహకులు అతిగా ప్రవర్తించారు. జరిగిన దానికి చింతిస్తున్నాం’ అని సిబిఎస్‌ఇ ప్రతినిధి రమా శర్మ అన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు నియమ, నిబంధనలు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లో అప్‌డేట్ చేశామని ఆమె తెలిపారు. అయితే ఇన్విజిలేటర్ల తీరువల్ల తాము ఇబ్బందులు పడినట్టు అనేక ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందినట్టు ఆమె వెల్లడించారు. కేరళలోని కన్నూరు పరీక్షా కేంద్రానికి బ్రా వేసుకొచ్చిన ఓ విద్యార్థిని అనుమతించకపోవడం విమర్శలు వెల్లువెత్తాయి. టీచర్ల నిర్వాకంతో చివరికి ఆ విద్యార్థినిని టాప్ ఇన్నర్‌వేర్ తీసి తల్లికి ఇచ్చి పరీక్ష హాలులోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటనకు బాధ్యులైన నలుగురు టీచర్లను అధికారులు సస్పెండ్ చేశారు. అలాగే పొడుగు చేతులు షర్టులు ధరించిన విద్యార్థులను హాఫ్ స్లీవ్‌లు వేసుకురావాలని సతాయించారు. బూట్లు వేసుకొస్తే అనుమతించకపోవడంతో బయటే వదిలేసి తల్లిదండ్రులు చెప్పులు వేసుకుని లోపలికి వెళ్లాల్సి వచ్చింది. విద్యార్థులు ఆభరణాలు వేసుకొస్తే అనుమతించలేదు. హైహీల్స్ వేసుకొచ్చిన విద్యార్థినులు వేధింపులకు గురయ్యారు.
విద్యార్థినికి సారీ చెప్పండి
ఇలావుండగా కన్నూర్ పరీక్షా కేంద్రం ప్రిన్సిపల్ నుంచి బోర్డు వివరణ కోరింది. బాధిత విద్యార్థినికి క్షమాపణ చెప్పాలని సిబిఎస్‌సి చైర్మన్ ఆర్‌కె చతుర్వేది ఆదేశించారు. బుధవారం ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జావడేకర్‌తో చతుర్వేది భేటీ అయ్యారు. వివాదానికి కారణమైన కన్నూర్ టిఐఎస్‌కె ఇంగ్లీష్ మీడియం స్కూలుకు చెందిన నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ఇదే అంశంపై కేరళ అసెంబ్లీ అట్టుడికిపోయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ముఖ్యమంత్రి పి రవి సభకు హామీ ఇచ్చారు. సిబిఎస్‌ఇ నిబంధనలు మానవత్వాన్ని మంటగలిపేలా ఉన్నాయని ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల విమర్శించారు. టీచర్ల నిర్వాకంపై కేరళ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిబిఎస్‌ఇని కమిషన్ ఆదేశించింది.