జాతీయ వార్తలు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: విభజన గాయాల నుండి ఆంధ్రప్రదేశ్ బతికి బట్టకట్టాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం పార్టీ సభ్యుడు అవంతి శ్రీనివాసరావు ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధించుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఉద్యమ బాట పట్టే ప్రమాదం ఉన్నదని శ్రీనివాసరావు హెచ్చరించారు. అవంతి శ్రీనివాసరావు సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం 2014లో రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంటులో ఇచ్చిన హామీ ఇంతవరకు అమలుకాలేదని ఆయన వాపోయారు. అన్ని రాజకీయ పార్టీలతోపాటు బిజెపి కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పట్లో డిమాండ్ చేసిందని ఆయన గుర్తుచేశారు. ఐదుకాదు.. పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసిందని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నది, ఇది మరింత పెరిగితే అదుపు చేయటం ప్రజాప్రతినిధులకు సాధ్యం కాదని ఆయన హెచ్చరించారు. విభజన మూలంగా సీమాంధ్ర తీవ్ర ఆర్థిక సమస్యల్లో పడిపోయింది, ఐటి, వౌలిక పరిశ్రమలు, విద్యా సంస్థలు, పబ్లిక్ రంగ పరిశ్రమలు తెలంగాణలోనే కేంద్రీకృతమై ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వీటన్నింటిని పునాదుల నుండి అభివృద్ధి చేయవలసి ఉన్నందున, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇది ఎలా సాధ్యమవుతుందని శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మించటంతోపాటు వౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలను అభివృద్ధి చేయటం అనేది ఎంతో పెద్ద పని, ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రత్యేక హోదా అవసరమని స్పష్టం చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని మూడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. రాష్ట్ర బడ్జెట్ లోటును భర్తీ చేసేందుకు ప్రత్యేక కేటాయింపులు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.