జాతీయ వార్తలు

ఎస్‌పి త్యాగిని ప్రశ్నించిన సిబిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించి వచ్చిన అవినీతి ఆరోపణలపై భారత వాయుసేన (ఐఎఎఫ్) మాజీ అధినేత ఎస్‌పి త్యాగిని సిబిఐ సోమవారం ప్రశ్నించింది. త్యాగి ఉదయం పది గంటలకు ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. భారత్‌కు హెలికాప్టర్లు సరఫరా చేయడానికి రూ. 3,600 కోట్ల విలువ గల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం కోసం హెలికాప్టర్ల తయారీ సంస్థ ఫిన్‌మెక్కానికా, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపనీలు భారత అధికారులకు మధ్యవర్తుల ద్వారా ముడుపులు చెల్లించిన విషయాన్ని ‘ద మిలన్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్’ (్భరత్‌లోని హైకోర్టుతో సమానమైనది) వివరించిన విషయం తెలిసిందే. మిలన్ కోర్టు తన ఆదేశాలలో అనేక చోట్ల త్యాగి పేరును పేర్కొంది. సిబిఐ ఇదివరకే త్యాగి, మరో 13మందిపై కేసు నమోదు చేసింది. వీరిలో త్యాగి సోదరులు కూడా ఉన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి సిబిఐ త్యాగిని ఇదివరకే విచారించింది. అయితే మిలన్ కోర్టు ఆదేశాలు వెలువడిన తరువాత తిరిగి అతడిని విచారించడం ఇదే మొదటిసారి. త్యాగి సోదరులకు కూడా విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు పంపించింది.