జాతీయ వార్తలు

అంధులకు లేఖకుల సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్‌కు హాజరయ్యే అంధులు, మెదడు పక్షవాతం వచ్చినవారు, కీళ్లు-కండరాలకు సంబంధించిన బలహీనతలు ఉన్నవారు.. ఇకపై లేఖకుల సహకారంతో పరీక్షలు రాయొచ్చు. ఈ రకమైన వికలాంగులు పరీక్షలు రాసేందుకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సహాయకులను ఏర్పాటు చేసుకునే సౌకర్యాన్ని యూపీఎస్సీ కల్పించింది. అంతే కాకుండా వీరు పరీక్ష రాసే సమయాన్ని కూడా గంటకు అదనంగా 20 నిమిషాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కోవకు చెందిన వికలాంగులు పరీక్ష రాసే సామర్థ్యం 40శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి... సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ రెండూ కూడా సహాయకుల సాయంతో రాసేందుకు అనుమతిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 2016 నోటిఫికేషన్ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు ఏడున జరుగనుంది.