జాతీయ వార్తలు

హైవేల వెంబడి మద్యం దుకాణాలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం రంగంలోకి దిగింది. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున దీనికి చెక్‌పెట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వవద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. తప్పతాగి వాహనాలు నడపడం వల్లే గత ఐదేళ్లలో 1,18,840 మంది మృతి చెందారు. ఎక్కడా హైవేల వెంబడి మద్యం షాపుకలు లైసెన్సులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, రవాణా కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంత అధికారులను ఆదేశించాం’ అని కేంద్ర రవాణ, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. డ్రంకన్ డ్రైవింగ్‌ను కట్టుదిట్టం చేయడం, ఎక్సయిజ్ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్రాలకు ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బ్రీత్ అనలైజర్లు తమ మంత్రిత్వశాఖ సమకూర్చుతుందని గడ్కరీ వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే 1988 మోటర్ వెహికల్స్ చట్టంలోని 185 సెక్షన్ కింద కఠిన శిక్షలు లేదా జరిమానా విధిస్తారని తెలిపారు.