జాతీయ వార్తలు

పోలీసు కాల్పుల్లో ఐదుగురు రైతులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, జూన్ 6: రుణమాఫీ, గిట్టుబాటు ధరకోసం రైతుల చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మృతిచెందారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్‌లో నిషేధాజ్ఞలు విధించారు. పిపాల్య మండీ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. భాయ్ పర్శానాధ్ ప్రాంతంలో దీక్షలు చేస్తున్న రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు రైతులు చనిపోయారు. అయితే పోలీసుల కాల్పుల్లో రైతులు మృతి చెందినట్టు వచ్చిన వార్తలకు సంబంధించి కచ్చితమైన సమాచారం తన వద్దలేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. పశ్చిమ మధ్యప్రదేశ్‌కు చెందిన రైతులు రుణమాఫీ, గిట్టుబాటు ధరల కోసం ఈ నెల 1 నుంచి దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని, వారి డిమాండ్లు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆందోళనకారులకు సోమవారం హామీ ఇచ్చారు.