జాతీయ వార్తలు

అర్థం లేని ట్రంప్ విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: ప్యారిస్ పర్యావరణ ఒప్పం దం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురి చేశాయని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. పారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలన్న నిర్ణయంపై అమెరికా పునరాలోచిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. ప్యారిస్ ఒప్పందం ద్వారా వందల వందల కోట్ల డాలర్లు విదేశీ సహాయ రూపంలో పొందటానికే భారత్ దానిపై సంతకం చేసిందని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్‌తోపాటు అన్ని దేశాలనుంచీ విమర్శలు వెల్లువెత్తాయి. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ విమర్శలు చేయటమే కాకుండా దానివల్ల అమెరికాలో ఉద్యోగాలు పోతాయని సాకు చెప్తూ దాన్నుంచి తప్పుకున్నారు. ఈ ఒప్పందంలో చైనా, భారత్‌లు అనుకూల నిబంధనలు ఏర్పాటు చేసుకున్నాయని కూడా ఆరోపించారు.