జాతీయ వార్తలు

పది పాసైతే పదివేల నగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 6: ఉత్తరప్రదేశ్‌లో టెన్త్ ఉత్తీర్ణత సాధించే బాలికలకు పదివేల రూపాయల ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు యూపీ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ మంగళవారం ఓ ప్రకటన చేశారు. సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ 2017 ఫలితాలు ఇప్పటికే ప్రకటించారు.
యూపీ బోర్డు ఫలితాలు వెల్లడికావల్సి ఉంది. కన్య విద్యా ధన్ యోజన (కెవిడివై) పథకం కింద ఈ నగదు బహుమతి ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే పేద ముస్లిం కుటుంబాలకు ఉపశమనం కలిగేలా కుమార్తెల వివాహాలకు సాయం అందిస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. ‘ముస్లింల సామూహిక వివాహాల కార్యక్రమాన్ని యోగి ఆదిత్యనాథ్ వంద రోజుల ప్రోగ్రాం పరిధిలోకి వస్తుంది. పేద ముస్లింల కుమార్తెలను ఆదుకోవాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం’ అని మైనారిటీ వ్యవహారాల మంత్రి మొహిసిన్ రజా తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 45వ పడిలోకి ప్రవేశించిన రోజునే లక్ష మంది బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాన్ని ప్రకటించడం గమనార్హం.