జాతీయ వార్తలు

ఎలాంటి ముప్పువాటిల్లినా యుద్ధానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 8: దేశ సార్వభౌమాధికారానికి ఎలాంటి ముప్పువాటిల్లినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని భారత సైనిక ప్రధానాధికారి బిపిన్ రావత్ గురువారం ఇక్కడ ప్రకటించారు. కాశ్మీర్‌పై పాకిస్తాన్ చేస్తున్న మోసపూరిత ప్రచారం, ఎత్తుగడలు ఎప్పటికీ సాగవని ఆయన హెచ్చరించారు. ‘శతృదేశాల కవ్వింపు చర్యలను తిప్పికొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఎలాంటి దాడులు దాడులు ఎదురైనా విజయవంతంగా తిప్పికొట్టగలం’ అని ఆయన స్పష్టం చేశారు. చైనా, పాకిస్తాన్ పేర్లు ప్రస్తావించకుండా ఆయనీ హెచ్చరికలు చేశారు. అంతర్గత భద్రత అలాగే పొరుగుదేశాల నుంచి వచ్చే ముప్పు నుంచి దేశాన్ని రక్షించుకునే సత్తా తమకు ఉందని బిపిన్ రావత్ చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ శతృవును దెబ్బతీయగల సామర్థ్యం తమకుందని, దీనికి తామెప్పుడూ సర్వసన్నద్ధంగానే ఉంటామని ఆర్మీ చీఫ్ పునరుద్ఘాటించారు. కాశ్మీర్ లోయలో శాంతిభద్రతలపై ఆయన మాట్లాడుతూ ‘పాకిస్తాన్ పనిగట్టుకుని మరీ సోషల్ మీడియాలో భారత్‌పై దుష్ప్రచారం చేస్తోంది. యువతను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది. అయితే పాక్ పన్నాగాలు సాగవు’ అని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లలో ఇండో-చైనా సరిహద్దులో ఒక్క తూటా కూడా వాడలేదని ప్రధాని మోదీనే ఓ సందర్భంలో అన్నారని రావత్ గుర్తుచేశారు.