జాతీయ వార్తలు

మార్స్‌పై ఉన్నా సాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 8: ‘ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. సాయం చేయడానికి సిద్ధం’ అంటూ స్పందించే వారిలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అందరికన్నా ముందుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అనేక సందర్భాల్లో ఆమె సోషల్ మీడియా ద్వారా వచ్చిన అభ్యర్థనకు సైతం స్పందించి వారిని ఆకట్టుకున్నారు కూడా. ‘నా బిడ్డకు ఆపరేషన్ చేయించడానికి భారత్‌కు తీసుకు రావాలి. వీసా ఇప్పించండి’ అంటూ పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల చేసిన అభ్యర్థనకు స్పందించిన సుష్మాస్వరాజ్ వెంటనే ఆ బాలుడికి మెడికల్ వీసా ఇప్పించడం తెలిసిందే. అంతేకాదు, సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు చేసే వ్యంగ్య వ్యాఖ్యలకు సైతం ఆమె అంతే దీటుగా స్పందిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా భారతీయులను ఆదుకునేందుకు అక్కడి భారత దౌత్య కార్యాలయాలు సిద్ధంగా ఉంటాయని ఇటీవల సుష్మాస్వరాజ్ ట్విట్టర్‌లో చేసిన ప్రకటనకు స్పందించాడో ఏమో తెలియదు కానీ కరణ్ సైనీ అనే ఓ నెటిజన్ గురువారం సుష్మాస్వరాజ్‌కు ఓ సరదా ట్వీట్ పంపించాడు. సుష్మ సైతం దానికి అంతే దీటుగా స్పందించారు. ‘నేను అంగారక గ్రహం (మార్స్)లో చిక్కుకు పోయాను. మంగళయాన్ ద్వారా పంపిన ఆహారం అయిపోయింది. మంగళయాన్-2ను ఎప్పు డు పంపిస్తారు’ అంటూ సైనీ సుష్మాస్వరాజ్‌కు ఓ ట్వీట్ పంపించాడు. దానికి సుష్మా సైతం అదే స్థాయిలో స్పం దిస్తూ‘ మార్స్‌లోనే కాదు, వేరే ఏ గ్రహంలో చిక్కుకుపోయి ఉన్నా సరే తమ దేశం వారికి సాయం చేయడానికి భారత దౌత్య కార్యాలయం సిద్ధంగా ఉంటుంది’ అని రీ ట్వీట్ చేశారు. ఇప్పుడు సుష్మ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కరణ్ సైనీ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.