జాతీయ వార్తలు

రైతుల ఆందోళన వెనుక స్వార్థపర శక్తుల హస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 8: మధ్యప్రదేశ్‌లో రైతులను కొన్ని శక్తులు రెచ్చగొడుతున్నాయని, ఈ అంశంపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. ‘రైతుల నిరసనలకు సంబంధించినంతవరకు భద్రతా దళాలు జోక్యం చేసుకోవలసిన అవసరం లేదు. అయితే కొన్ని శక్తులు మధ్యప్రదేశ్‌లో రైతులను రెచ్చగొడుతున్నాయని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించినందున దాని నివేదిక వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది’ అని రాజ్‌నాథ్ గురువారం ఇక్కడ విలేఖరులు మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పు ల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాజ్‌నాథ్ ముంబయి వచ్చారు. రైతులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీసే ఏ పనీ బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేయబోదని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ రైతులకు హామీ ఇచ్చా రు. ‘కేంద్రంలోకానీ రాష్ట్రంలోకానీ బిజెపి ప్రభుత్వాలు రైతుల సమస్యలపై పూర్తి సానుకూలంగా ఉందనే విషయాన్ని ఈ దేశ ప్రజలకు స్పష్టం చేయదలిచాను. రైతులు ముందుకు వచ్చి తమ ముఖ్యమంత్రులతో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలనేది వారికి నా అభ్యర్థన’ అనిరాజ్‌నాథ్ అన్నారు.
‘నేనూ ఒక రైతుబిడ్డను. అంతేకాదు వ్యవసాయ మంత్రి గా కూడా పని చేశాను. ప్రధాని మోదీలాగా 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గతంలో ఏ ప్రధానీ హామీ ఇవ్వలేదు’ అని కూడా రాజ్‌నాథ్ అన్నా రు. రైతుల ఆందోళనలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాలు పంచుకోవడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ, తాము సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నామని, రైతుల రాబడిని పెంచడానికి ఏమీ చేయలేదనే విషయాన్ని కాంగ్రెస్ మరిచిపోరాదన్నారు. ఈ దేశంలో రైతుల దుస్థితికి కాంగ్రెసే కారణమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
మంగళవారం మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఆందోళన చేస్తున్న రైతులు హింసాకాండకు దిగడం, పోలీసులు జరిపిన కాల్పుల్లో అయిదుగురు రైతులు మృతిచెందడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనపై ఇప్పటికే అక్కడ ఉన్న ఆరు పారా మిలటరీ బలగాల బెటాలియన్లకుతోడుగా కేంద్రం బుధవా రం మరో అయిదు బెటాలియన్ల సిఆర్‌పిఎఫ్, రాఫ్ బలగాలను పంపించింది.