జాతీయ వార్తలు

మందసౌర్‌లో మరో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందసౌర్, జూన్ 9: రైతుల ఆందోళనలతో అట్టుడుగుతున్న మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలోని బడవాన్ గ్రామంలో 26 ఏళ్ల యువ రైతు అనుమానాస్పద స్థితిలో మరణించడం వివాదాస్పదంగా మారింది. పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లనే అతను చనిపోయాడని స్థానికులు శుక్రవారం ఆరోపించారు. కాగా, గురువారం రాత్రి చనిపోయిన స్థితిలో అతడ్ని ఆస్పత్రికి తీసుకువచ్చారని, అతని శరీరంపై దాడి చేసిన గుర్తులున్నాయని ఇండోర్‌లోని ఎంవై ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. అయితే అతని మృతికి దారితీసిన పరిస్థితులేమిటో స్పష్టంగా తెలియదని, సంఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. కాగా, జిల్లాల్లో రైతు మరణాల్లో ఇది ఆరవది. గత మంగళవారం జిల్లాలో పోలీసు కాల్పుల్లో అయిదుగురు రైతులు మృతి చెందడంతో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగడం తెలిసిందే.
గ్రామస్థుల కథనం ప్రకారం- ఘనశ్యామ్ ధకడ్ అనే ఆ రైతు గురువారం సాయంత్రం గుడికి వెళ్తుండగా కొంతమంది పోలీసులు అతడ్ని దారిలో ఆపి కర్రలతో చితకబాదారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఇండోర్‌లోని ఎంవై ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ అతను చనిపోయాడని వారు అంటున్నారు. మందసౌర్ జిల్లా కలెక్టర్ మనోజ్ కుమార్ సింగ్ శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. ఘనశ్యామ్ మృతికి కారణాలపై దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు. పోలీసులు నిష్కారణంగా తమను చితకబాది, అరెస్టు చేస్తున్నారని ఈ సందర్భంగా గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులను పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా మాజీ ఎంపి కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సజ్జన్ సింగ్ వర్మ శుక్రవారం ఆస్పత్రికి చేరుకుని రైతు ఘన్‌శ్యామ్‌ను కొట్టి చంపారని ఆరోపించారు. రైతుతో పాటుగా ఉండిన ముగ్గురి జాడ తెలియడం లేదని, వారి ఏమయ్యారో పోలీసులు దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయం చేస్తున్నారు: రవిశంకర్
అహ్మదాబాద్: మధ్యప్రదేశ్ రైతుల ఆందోళనను కొంతమంది రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. రైతుల సంక్షేమంకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అద్భుతంగా కృషి చేస్తున్నారని కూడా ఆయన అన్నారు.

చిత్రాలు.. మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులకు నిరసనగా శుక్రవారం ఢిల్లీలో రైల్‌రోకో ఆందోళన చేస్తున్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలు
*ఇండోర్-్భపాల్ హైవేపై ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టి మంటలను ఆర్పుతున్న భద్రతా దళాలు