జాతీయ వార్తలు

‘సెల్ఫీ విత్ డాటర్’ యాప్‌ను ఆవిష్కరించిన రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తెతో సెల్ఫీ (సెల్ఫీ విత్ డాటర్) మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. అమ్మాయిలు వద్దంటూ భ్రూణహత్యలకు పాల్పడుతున్న వారిలో చైతన్యం తీసుకురావడం ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా రాష్టప్రతి మాట్లాడుతూ, ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి తల్లిదండ్రులు తమ కుమార్తెలతో సెల్ఫీలు దిగి వాటిని అప్‌లోడ్ చేయాలని కోరారు.
అంతేకాదు ‘సెల్ఫీ విత్ డాటర్’ ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారిందని కూడా ఆయన అన్నారు. హర్యానాలోని జింద్ జిల్లా బీబీపూర్ గ్రామంలో సునీల్ జగ్లాన్ అనే అతను 2015 జూన్‌లో ఈ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. మాజీ సర్పంచ్ అయిన ఆయన మహిళా సాధికారికత, గ్రామీణాభివృద్ధి రంగా ల్లో కృషి చేస్తున్నారు. అమ్మాయిలను కన్న తల్లిదండ్రులు గర్వంగా ఫీల్ కావడం, ఫలితంగా సమాజంలో ఆడపిల్లల నిష్పత్తి మెరుగుపర్చడం ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యం. స్ర్తి-పురుష అసమానత్వం వల్ల తలెత్తే సమస్యలకు ఈ ఉద్యమం పరిష్కారం కాగలదన్న విశ్వాసాన్ని రాష్టప్రతి వ్యక్తం చేశారు. పురుషులతో పోలిస్తే దేశంలోనే అతి తక్కువ స్ర్తి జనాభా ఉన్న రాష్ట్రం అయిన హర్యానాలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన జగ్లాన్‌ను రాష్టప్రతి ఈ సందర్భంగా అభినందించారు.

చిత్రం.. రాష్టప్రతి భవన్‌లో శుక్రవారం ‘సెల్ఫీ విత్ డాటర్’ మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తున్న రాష్టప్రతి ప్రణబ్