జాతీయ వార్తలు

కుప్పకూలిన హెలికాప్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, జూన్ 10: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయానికి భక్తులను తీసుకువెళుతున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయంది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ఇంజనీర్ ఒకరు మృతిచెందగా, పైలట్లిద్దరూ గాయాలతో బయటపడ్డారు. హరిద్వార్ నుంచి బద్రీనాథ్‌కు వెళ్తున్న ఈ కాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు భక్తులూ క్షేమంగా ఉన్నారు. చనిపోయిన ఇంజనీర్‌ను అస్సాంకు చెందిన విక్రమ్ లాంబాగా గుర్తించామని చమోలి ఎస్పీ తృప్తి భట్ తెలిపారు. హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో ప్రమాదం జరిగిందని రోటర్ బ్లేడ్ తగలడం వల్ల విక్రమ్ లాంబా మృతిచెందాడని ఆయన వివరించారు. ప్రమాదం శనివారం ఉదయం 7.45 గంటలకు జరిగిందని పైలట్ సంజయ్ వాజెకు వెన్నుమీద, కోపైలట్ అల్కా సుక్లాకు చిన్నపాటి గాయాలయ్యాలని తెలిపారు. ఇందులో ప్రయాణిస్తున్న ఐదుగురు భక్తులు గుజరాత్‌లోని వడోదరాకు చెందినవారు. ప్రమాదానికి గురైన అగస్టా హెలికాప్టర్ ముంబయికి చెందిన క్రిస్టల్ ఏవియేషన్ కంపెనీకి చెందిందని తెలిపారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే సివిల్ ఏవియేషన్ అధికారులు, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇనెస్టిగేషన్ బ్యూరో అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

చిత్రం.హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలు