జాతీయ వార్తలు

కన్హయ్య కుమార్ ఆరోగ్యం విషమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: గత ఫిబ్రవరి 9న జెఎన్‌యు క్యాంపస్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి యూనివర్శిటీ అధికారులు విద్యార్థులకు విధించిన శిక్షలకు నిరసనగా గత ఎనిమిది రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను గురువారం యూనివర్శిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మరోవైపు ఆయనతో పాటుగా నిరాహార దీక్షలో పాల్గొంటున్న ఐదుగురు యూనివర్శిటీ విద్యార్థులు ఆరోగ్యం దిగజారడంతో తమ దీక్షను విరమించుకున్నారు. కన్హయ్య కుమార్ బిపి 56కు పడిపోయిందని, సుగర్ స్థాయిలు కూడా గణనీయంగా పడిపోతున్నాయని, ఆయన నిన్న రాత్రినుంచి వాంతులు చేసుకుంటున్నాడని, దాదాపు అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను జెఎన్‌యు మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లినట్లు విద్యార్థి సంఘం విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది, దీక్ష చేస్తున్న మిగతా విద్యార్థుల ఆరోగ్యం కూడా దిగజారిపోతోందని, అయినప్పటికీ, యూనివర్శిటీ పాలకవర్గం దిగివచ్చే దాకా తమ పోరాటం కొనసాగిస్తామని ఆ ప్రకటన స్పష్టం చేసింది.