జాతీయ వార్తలు

60వేల పరిహారంతో నవవధువుకు విడాకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంభల్ (ఉత్తరప్రదేశ్), జూన్ 12: దేశంలో లింగ సమానత్వం కోసం జరుగుతున్న ప్రయత్నాలకు విఘాతం కలిగించే ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం జరిగింది. ఒకే విడతలో మూడుసార్లు తలాక్ చెప్పి నవవధువు (22)కు విడాకులిచ్చిన 45 ఏళ్ల వ్యక్తికి కుల పంచాయితీ పెద్దలు రూ.2 లక్షల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.60 వేల పరిహారాన్ని చెల్లించాల్సిందిగా అతడిని ఆదేశించి సరిపుచ్చారు. అంతేకాకుండా అతను పుచ్చుకున్న వరకట్నాన్ని వధువు కుటుంబానికి తిరిగి ఇప్పించి సమస్యను ‘తేల్చే’శారు. సంభల్ జిల్లా రాయ్‌సతి ఏరియాలోని ఖలీల్ ఉల్ ఉలూమ్ మదర్సాలో టర్క్ సామాజికవర్గ పెద్దలు నిర్వహించిన ఈ పంచాయితీకి 52 గ్రామాల సభ్యులు హాజరయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. కేవలం 10 రోజుల క్రితమే వివాహం చేసుకున్న ఈ దంపతుల మధ్య గొడవ ప్రారంభమవడంతో ఆగ్రహించిన భర్త మూడుసార్లు తలాక్ చెప్పి భార్యను పుట్టింటికి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాడు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు న్యాయంకోసం టర్క్ పంచాయితీని ఆశ్రయించడంతో ఆ సామాజికవర్గ పెద్దలు సోమవారం పంచాయితీ నిర్వహించి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కాళ్ల పారాణి కూడా ఆరని నవవధువుకు ఒకే విడతలో మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులిచ్చినందుకు వరునిపై వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అతనికి రూ.2 లక్షల జరిమానా విధించారని, దీంతో అతను తక్షణమే ఆ మొత్తాన్ని చెల్లించాడని, అలాగే వరుడు వరకట్నం కింద పుచ్చుకున్న సొమ్మును, వస్తువులను కూడా తిరిగి ఇప్పించడంతో పాటు వధువుకు రూ.60 వేల పరిహారాన్ని చెల్లించాల్సిందిగా పెద్దలు అతడిని ఆదేశించారని పంచాయితీ సమన్వయకర్త షాహిద్ హుస్సేన్ పిటిఐ వార్తా సంస్థకు వివరించాడు. ఎంతో సున్నితమైన ట్రిపుల్ తలాక్ అంశంపై ప్రస్తుతం సుప్రీం కోర్టు దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఈ పంచాయితీ అస్రార్ బాబు అనే వ్యక్తి ఆధ్వర్యంలో జరిగింది. విడాకులకోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే విడతలో మూడుసార్లు తలాక్ చెప్పడాన్ని అనుమతించరాదని టర్క్ సామాజికవర్గ సభ్యులు కొద్దిరోజుల క్రితం నిర్ణయించారని, పరిస్థితి విడాకుల వరకూ వచ్చిన పక్షంలో తొలి విడతలో ఒకసారి, రెండో విడతలో మరోసారి తలాక్ చెప్పేందుకు మాత్రమే అనుమతించి, ఈ రెండు విడతల మధ్యకాలంలో సదరు దంపతుల మధ్య విభేదాలను తొలగించేందుకు ప్రయత్నించాలని వారు నిశ్చయించారని షాహిద్ హుస్సేన్ తెలిపారు. ఇంతకుముందు ఈ పంచాయితీ పెద్దలు వరకట్నాన్ని, వివాహ సమయాల్లో ఆర్భాటంగా డబ్బు ఖర్చు చేయడాన్ని, సామాజిక కార్యక్రమాల్లో డిజెలు (డిస్కో జాకీలు) చెవులు చిల్లులు పడేలా సంగీత కచేరీలు నిర్వహించడాన్ని కూడా నిషేధించారని హుస్సేన్ చెప్పారు.