జాతీయ వార్తలు

నాటకాలు కట్టిపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 12: ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి కె పళనిస్వామి నాటకాలు ఆడుతున్నారని అన్నాడిఎంకె రెబర్ నేత ఓ పన్నీర్ సెల్వం ధ్వజమెత్తారు. రెండు వర్గాలు కలిసి పనిచేసే వాతావరణాన్ని పళని శిబిరం దెబ్బతీస్తోందని సోమవారం ఆయన ఆరోపించారు. రెండు వర్గాలు ఐక్యమత్యంతో పనిచేయాలని గతంలో తీసుకున్న నిర్ణయాలను రద్దుచేస్తున్నట్టు ప్రకటించిన మర్నాడే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అధికార వర్గంపై విరుచుకుపడ్డారు. నిర్మాణాత్మంగా వ్యవహరించాల్సిందిపోయి డ్రామాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి పళనిస్వామి శిబిరంపై ఆయన విమర్శలు గుప్పించారు. అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు కలిసి పనిచేయాలని ఏప్రిల్‌లోనిర్ణయించగా పళనిస్వామి శిబిరం మాత్రం నాటకాలు ఆడుతూ వస్తోందని మాజీ సిఎం ధ్వజమెత్తారు. పళనిస్వామితో శిబిరంలో కలిసి తాము నాటకాలు ఆడబోమని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ‘రెండు వర్గాలు కలిసి పనిచేయాలన్న అభిప్రాయంతో ప్రజలూ ఏకీభవించడంలేదు. గతంలో మా మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దుచేసుకుంటున్నాం’ అని ఆదివారం ఓపిఆర్ ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు ఎటువైపు ఉన్నారో త్వరలోనే తేలిపోతుందని ఆయన అన్నారు. పార్టీ ప్రధాన కేంద్రం అలాగే రెండాకుల గుర్తు ఎన్నికల కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, త్వరలోనే అది పరిష్కారమవుతుందన్న ఆశాభావం పన్నీర్ సెల్వం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ నుంచి మంచి నిర్ణయమే వెలువడుతుందని ఆయన అన్నారు. రాష్టప్రతి ఎన్నికల్లో ఎవర్ని బలపరచాలన్న దానిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.