జాతీయ వార్తలు

11 మంది పాక్ ఖైదీల విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: ఓ వైపు భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ సోమవారం మన దేశం 11 మంది పాకిస్తానీ ఖైదీలను విడుదల చేసి వాఘా సరిసద్దు వద్ద ఆ దేశ అధికారులకు అప్పగించింది. తమ జైలుశిక్షలను పూర్తి చేసుకున్న తర్వాత వీరిని విడుదల చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీరిలో దాదాపు అందరు కూడా వివిధ సమయాల్లో పొరబాటున సరిహద్దులు దాటి మన భూభాగంలోకి ప్రవేశించినవారే. వీరిలో నలుగురు జమ్మూకాశ్మీర్‌లో, ముగ్గురు రాజస్థాన్‌లో, ఇద్దరు పంజాబ్‌లోని జైళ్లలో ఉండగా, ఢిల్లీ, హర్యానాల్లో ఒక్కొక్కరున్నారు. వీరంతా కూడా 30-40 ఏళ్ల మధ్య వారేనని, జైలుశిక్షలు పూర్తి చేసుకున్న వీరిని ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం వారి వివరాలను వెరిఫై చేసిన తర్వాత విడుదల చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ రోజు విడుదలయిన వారిలో ఒక హిందువు కూడా ఉన్నాడు.