జాతీయ వార్తలు

రాష్టప్రతి అభ్యర్థిపై బిజెపి కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: బిజెపి అధినాయకత్వం కొత్త రాష్టప్రతి ఎంపిక కోసం ప్రతిపక్షాలతో చర్చించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సోమవారం కొత్త రాష్టప్రతి ఎంపికపై చర్చించేందుకు ముగ్గురు సీనియర్ మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, సమాచార, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈ కమిటీ సభ్యులు. ఈ ముగ్గురు సీనియర్ మంత్రులు కొత్త రాష్టప్రతి ఎంపిక గురించి ప్రతిపక్ష పార్టీల నాయకులతోపాటు ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులతో కూడా సమాలోచనలు జరుపుతారని అమిత్ షా తెలిపారు. రాష్టప్రతి పదవికి ప్రతిపక్షం తరఫున పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముగ్గురు సీనియర్ ప్రతిపక్ష నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేయటం తెలిసిందే. జైట్లీ కమిటీ ఈ కమిటీ సభ్యులతో కూడా చర్చలు జరుపుతారు. రాష్టప్రతి పదవికి గిరిజన నాయకురాలు, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, తావర్‌చంద్ గెహ్లోత్ పేర్లను బిజెపి పరిశీలిస్తోందని వార్తలు రావటం తెలిసిందే.
ఇదిలా ఉంటే ప్రతిపక్షం జాతిపిత మహాత్మా గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ, జెడి (యు) సీనియర్ నాయకుడు,రాజ్యసభ సభ్యుడు శరద్ యాదవ్, ఎన్‌సిపి అధినాయకుడు, రాజ్యసభ సభ్యుడు శరద్‌పవార్ తదితరుల పేర్లు పరిశీలించటం విదితమే. రాష్టప్రతి అభ్యర్థి ఎంపిక విషయమై ప్రతిపక్షాలు సైతం ఈ నెల 14న (బుధవారం) సమావేశం అవుతున్నాయి. జైట్లీ,రాజ్‌నాథ్, వెంకయ్యనాయుడు కమిటీ కొత్త రాష్టప్రతి కోసం తమ అభ్యర్థి పేరును ప్రతిపక్షం ముందు ప్రతిపాదిస్తుందా? లేక ఈ అంశంపై వారి అభిప్రాయాలు మాత్రమే తెలుసుకుంటుందా? అనేది స్పష్టం కావటం లేదు. బిజెపి కమిటీ మొదట కొత్త రాష్టప్రతిగా ఎవరుంటే బాగుంటుందనే అంశంపై మాత్రమే చర్చలు జరిపే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అధికార పార్టీ తమ అభ్యర్థి పేరును ఇప్పుడే బైట పెట్టకుండా ప్రతిపక్షాల అభిప్రాయాల సేకరణ మాత్రమే చేస్తుందనే మాట కూడా వినిపిస్తోంది. ఇదే జరిగితే ప్రతిపక్ష నాయకులతో జైట్లీ కమిటీ జరిపే చర్చలు సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చునని అంటున్నారు. అధికార పక్షం అభ్యర్థి పేరు బైట పెట్టకుండా చర్చ ఎలా జరుగుతుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి రెండో టర్మ్ ఇచ్చేందుకు బిజెపి ముందుకు వస్తే కొత్త రాష్టప్రతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేందుకు అవకాశం ఉన్నదని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే ప్రణబ్ ముఖర్జీకి రెండో టర్మ్ ఇచ్చే ప్రసక్తే లేదని బిజెపి అధినాయకత్వం ఇదివరకే స్పష్టం చేసింది. లోక్‌సభలో తమకు మొదటిసారి మెజారిటీ లభించినందున తమ పార్టీ సీనియర్ నాయకుడిని రాష్టప్రతి భవన్‌కు పంపిస్తామని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు ఉన్న వారిని, హిందూత్వ సంస్థలతో సంబంధం ఉన్న వారిని బిజెపి ప్రతిపాదిస్తే ప్రతిపక్షం తప్పకుండా వ్యతిరేకిస్తుంది కాబట్టి పోటీ తప్పదు. అయితే జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్మును ప్రతిపాదిస్తే ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించటం ప్రతిపక్షానికి కష్టమైపోతుంది. రాష్టప్రతి ఎన్నికకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 28 కావడం తెలిసిందే.