జాతీయ వార్తలు

ధిక్కార నేరాలను అరికట్టే అధికారాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: నిరాధారమైన ఆరోపణలను చేసి తమను అపఖ్యాతి పాలు చేసేవారిపై ధిక్కార చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును ఈ రకమైన ఆరోపణలు చేసేవారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని న్యాయమంత్రిత్వశాఖకు రాసిన లేఖలో పేర్కొంది. ఇందుకు వీలుగా 1971నాటి కోర్టు ధిక్కార చట్టాన్ని సవరించాలని ఆ విధంగా తమకు నిరాధార ఆరోపణలు చేసేవారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించాలని కోరింది. ఇప్పటికే ఫిలిప్పీన్స్, ఘనా, పాకిస్తాన్ తదితర దేశాల్లోని ఎన్నికల కమిషన్లకు ధిక్కార నేరాలను అరికట్టేందుకు అధికారాలున్నాయని గుర్తు చేసింది. ధిక్కార నేరాలకు సంబంధించి హైకోర్టులకు ఏ రకమైన అధికారాలుంటాయో వాటిని తమకు సమకూర్చాలని కోరింది.