జాతీయ వార్తలు

సంజయ్‌దత్‌కు కొత్త కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 12: 1993 నాటి ముంబయి వరస పేలుళ్ల కేసులో అక్రమ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు కొత్త చిక్కులు తప్పేట్లు కనిపిస్తోంది. ఈ కేసులో అయిదేళ్ల శిక్షాలం పూర్తి కావడానికి ఎనిమిది నెలలు ముందే ఆయనను ఎందుకు విడుదల చేశారో కారణాలు తెలియజేయాలని బొంబాయి హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్రమ ఆయుధాలను కలిగి ఉన్నారన్న ఆరోపణపై సంజయ్‌దత్‌కు అయిదేళ్లు శిక్ష విధించిన విషయం తెలిసిందే. విచారణ సమయంలో బెయిలుపై ఉండిన సంజయ్‌దత్ సుప్రీంకోర్టు ఆయన శిక్షను ధ్రువీకరించడంతో 2013 మేలో ఆయన కోర్టులో లొంగిపోయారు. అయితే శిక్షా కాలం పూర్తి కావడానికి ఎనిమిది నెలలు ముందుగానే సత్ప్రవర్తన కారణంగా 2016 ఫిబ్రవరిలో ఆయనను ఎరవాడ జైలునుంచి విడిచిపెట్టారు. జైల్లో శిక్షను అనుభవిస్తున్న సమయంలో కూడా సంజయ్‌దత్‌కు తరచూ పెరోల్స్ , సెలవులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ పుణెకు చెందిన అపదీప్ భలేకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్ (పిల్)ను విచారించిన సందర్భంగా న్యాయమూర్తులు ఆర్‌ఎం సావంత్, సాధనా జాదవ్‌లతో కూడిన బెంచ్ దత్‌కు శిక్షను తగ్గించే విషయంలో నిబంధనలను పాటించడం జరిగినట్లు తెలియజేస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘జైళ్ల శాఖ డిఐజిని సంప్రదించారా? లేక జైలు సూపరింటెండెంట్ నేరుగా తన సిఫార్సును గవర్నర్‌కు పంపించారా?’ అని జస్టిస్ సావంత్ ప్రశ్నించారు. అంతేకాదు దత్ ప్రవర్తన బాగా ఉందని అధికారులు ఎలా అంచనా వేశారు? శిక్షాకాలంలో సగం పెరోల్‌పై జైలు బయటే ఉన్నప్పుడు అంచనా వేయడానికి సమయం ఎప్పుడు దొరికిందని కూడా ఆయన ప్రశ్నించారు. కాగా, వారం రోజుల తర్వాత కోర్టు ఈ అంశంపై తదుపరి విచారణ జరుపుతుంది.