జాతీయ వార్తలు

కాబోయే రాష్టప్రతి రామ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి పదవికి అధికార పక్షం బిజెపి ఎంపిక చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో దళిత నాయకుడు రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. రామ్‌నాథ్‌కు ఎన్డీయే మిత్రపక్షాలు మద్దతు ప్రకటిస్తే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ భాగస్వామ్య పక్షాలు తమ నిర్ణయాన్ని ఈనెల 22న ప్రకటించనున్నాయి. బిజెపి తమతో ప్రారంభించిన చర్చల ప్రక్రియ పూర్తికాకముందే ఏకపక్షంగా అభ్యర్థి ఎంపికలో నిర్ణయం తీసుకున్నదని ప్రతిపక్షం ఆరోపించింది. రాష్టప్రతి పదవికి జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరుల పేర్లను పరిశీలిస్తున్నట్టు వార్తలు రావటం తెలిసిందే. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి పదవికి అభ్యర్థిగా బిజెపి ఎంపిక చేసింది. బోర్డు సమావేశం అనంతరం రామ్‌నాథ్ కోవింద్ పేరు ఖరారు చేసినట్టు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. దళిత వర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్ సమర్థుడైన పార్లమెంటేరియన్ కావటంతోపాటు మంచి న్యాయవాది అని అమిత్ షా చెప్పారు. రామ్‌నాథ్ కోవింద్ ఎంపిక గురించి ఎన్డీయే మిత్రపక్షాలతోపాటు ప్రతిపక్ష పార్టీల నాయకులకూ తెలియజేస్తున్నాం. వారంతా రామ్‌నాథ్‌కు మద్దతిస్తారనే ఆశాభావాన్ని అమిత్ షా వ్యక్తం చేశారు. అయితే ఉప రాష్టప్రతి అభ్యర్థి గురించి నేటి సమావేశంలో చర్చించలేదని అమిత్ షా వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరు జిల్లా పరౌంక్ గ్రామంలో 1945 అక్టోబర్ 1న రామ్‌నాథ్ కోవింద్ జన్మించారు. 1994-2000 వరకు, 2000- 06 వరకు రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. బిజెపి దళిత మోర్చా అధ్యక్ష బాధ్యతలతోపాటు పార్టీ అధికార ప్రతినిధిగానూ పనిచేసిన కోవింద్, 2015 ఆగస్టు నుంచి బీహార్ గవర్నర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. న్యాయవాది కూడా అయిన కోవింద్ ఐక్య రాజ్య సమితి జనరల్ బాడీ సమావేశంలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ లేదా మరో సీనియర్ నాయకుడిని రాష్టప్రతిగా నియమిస్తే తనకు చిక్కులు ఎదురు కావొచ్చనే ఆలోచనతోనే రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి పదవికి నరేంద్ర మోదీ ఎంపిక చేశారని అంటున్నారు. రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీకి వచ్చి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. బిజెపి తీసుకున్న నిర్ణయం మేరకు రామ్‌నాథ్ 23న నామినేషన్ పత్రాల దాఖలు చేయవచ్చు. బిజెపి బోర్డు సమావేశం ముగిసిన వెంటనే నరేంద్ర మోదీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు టెలిఫోన్ చేసి కోవింద్ ఎంపిక గురించి తెలియజేసి మద్దతు కోరారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతోపాటు పలువురు పార్టీ సీనియర్లు, ఎన్డీయే మిత్రపక్షాల నాయకులకు ఫోన్‌చేసి రామ్‌నాథ్ కోవింద్ ఎంపిక గురించి తెలియజేసి వారి మద్దతు అడిగారు. ఎన్డీయే మిత్రపక్షాలన్నీ కోవింద్ అభ్యర్థిత్వాన్ని సమర్థించాయి. కోవింద్ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ సమర్థించారు. అకాలీదళ్ ఎంపీ చందు మాజ్రా మద్దతు ప్రకటించారు. ఢిల్లీ మాజీ సిఎం షీలాదీక్షిత్ కూడా కోవింద్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ‘ఇది మంచి ఎంపిక’ అని కితాబిచ్చారు. తమిళనాడులో అధికారంలోవున్న అన్నాడిఎంకెకు చెందిన రెండు వర్గాలూ కోవింద్‌కు మద్దతు ప్రకటించాయి.