జాతీయ వార్తలు

యుపిఏ రాష్టప్రతి అభ్యర్థి మీరాకుమార్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: రాష్టప్రతి పదవికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను యుపిఏ మిత్రపక్షాల అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశాలున్నాయి. బిజెపి తమతో ప్రారంభించిన చర్చల ప్రక్రియ పూర్తి చేయకుండానే రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి అభ్యర్థిగా బిజెపి ప్రకటించడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో తమ అభ్యర్థిగా మీరాకుమార్‌ను రంగంలోకి దించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన యుపిఏ మిత్రపక్షాలు ఈ నెల 22న సమావేశమైనప్పుడు ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బిజెపి త్రిసభ్య కమిటీ రాష్టప్రతి అభ్యర్థి ఎంపికపై మళ్లీ చర్చలు జరుపుతామని చెప్పి, ఆ ప్రక్రియ పూర్తి కాకుండానే అభ్యర్థిని ప్రకటించిందని రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ కార్యదర్శి డి.రాజా తదితర నాయకులు విమర్శించారు. దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి అభ్యర్థిగా ప్రకటించటం ద్వారా తమను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించిన బిజెపికి గుణపాఠం నేర్పించాలని కాంగ్రెస్, వామపక్షాలు భావిస్తున్నాయి. అయితే బిజెపి దళిత నాయకుడిని రాష్టప్రతి పదవికి ఎంపిక చేయటంతో ప్రతిపక్షంలోని దళిత పార్టీలు చిక్కుల్లో పోడిపోయాయి. బిహార్‌లో అధికారంలో ఉన్న జెడి(యు) రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లి రామ్‌నాథ్ కోవింద్‌ను అభినందించారు. మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ కూడా రామ్‌నాథ్‌కు మద్దతు ఇవ్వవచ్చునని అంటున్నారు. ఆర్‌జెడికి చెందిన దళిత ఎంపీలు కూడా మద్దతు ప్రకటించటంతోపాటు ప్రతిపక్షంలోని దళిత ఎంపీలందరూ కోవింద్‌కు మద్దతు ఇవ్వాలని పిలుపు ఇచ్చారు.
22న ప్రతిపక్షం నిర్ణయం
బిజెపి రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇవ్వాలా లేక తమ అభ్యర్థిని రంగంలోకి దించాలా అనే అంశంపై ప్రతిపక్షం ఈ నెల 22న నిర్ణయిస్తుంది. కొత్త రాష్టప్రతి అభ్యర్థి గురించి చర్చించేందుకు యుపిఏ మిత్రపక్షాలు 22న ఢిల్లీలో సమావేశం కానున్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తి రాష్టప్రతి పదవి చేపట్టాలన్నది ప్రతిపక్షం వాదన. బిజెపి ఎంపిక చేసిన రాంనాథ్ కోవింద్‌కు మద్దతు ఇవ్వాలా వద్దా? అనేది మిత్రపక్షాలతో చర్చించిన తరువాత నిర్ణయిస్తామని సిపిఐ కార్యదర్శి డి.రాజా చెప్పారు. రాంనాథ్ కోవింద్ పేరును బిజెపి ఏకపక్షంగా ప్రకటించిందని రాజా విమర్శించారు. త్రిసభ్య కమిటీ సభ్యులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు ఇటీవల తమను కలిసి కొత్త రాష్టప్రతి ఎంపిక గురించి చర్చించారు, వారు పేరు చెప్పకుండానే మా అభిప్రాయాలు అడిగారు, అయితే మళ్లీ చర్చిస్తామని వెళ్లిన వారు అకస్మాత్తుగా తమ అభ్యర్థి పేరును ప్రకటించారని రాజా విమర్శించారు.