జాతీయ వార్తలు

400 మిలియన్ డాలర్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటలపాటు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఉద్దేశించిన పథకాలను చేపట్టేందుకు ప్రపంచ బ్యాంకు, ఏఐఐబి నుండి 400 మిలియన్ డాలర్ల అందజేయనున్నాయి. ప్రపంచ బ్యాంకు 240 మిలియన్ యుఎస్ డాలర్ల రుణం ఇస్తే, ఏఐఐబి 160 మిలియన్ యుఎస్ డాలర్ల రుణం అందజేస్తుంది. ప్రపంచ బ్యాంకు, ఏఐఐబికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య గురువారం ఈ మేరకు ఒప్పందం కుదిరింది. కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్, ప్రపంచ బ్యాంకు భారత విభాగం కంట్రీ డైరెక్టర్ హిషం అబ్దో, ఏఐఐబి ప్రధాన పెట్టుబడుల అధికారి డి.జె.పాండియన్ రుణ ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు. 24 గంటలపాటు విద్యుత్‌ను పంపిణీ చేసేందుకు సంబంధించిన ఒప్పందంపై ఏపి ప్రభుత్వం ఇంధన సలహాదారు కె.రంగనాథం, ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరక్టర్, ఏఐఐబి ఉపాధ్యక్షుడు సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం ఖర్చు 570 మిలియన్ డాలర్లు కాగా రెండు బ్యాంకులు కలిసి 400 మిలియన్ డాలర్ల మేరకు రుణాలు మంజూరు చేస్తాయి.