జాతీయ వార్తలు

హామీ నిలబెట్టుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 7: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలంటూ ఏపి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావుకేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడుకు శనివారం నాడొక లేఖ రాశారు. ‘దయచేసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మీకున్న అనుబంధం, బిజెపి పూర్వాధ్యక్షుడుగా మీకున్న అనుభవం రంగరించి హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. మీ పార్టీని ఒప్పించి ఈనెల 13న నేను ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అనుకూలంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నింటితో ఓటు వేయించి దేశ రాజకీయ చరిత్రలో ఒక ధృవతారగా వెలుగొందాలని కోరుతున్నాను’ అంటూ కెవిపి తన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని చెప్పటంతోపాటు రాష్ట్ర ఆర్థిక లోటును కూడా భర్తీ చేయలేమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయి చౌదరి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ప్రకటించడం దుస్సాహసహమేనని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో సీమాంధ్రకు చెందిన ఏ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, మంత్రి కూడా అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో విభజనను సమర్థించలేదని లేఖలో పేర్కొన్నారు. ‘మీరు కర్నాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్నా సీమాంధ్ర ప్రజల తరపున వకాల్తా తీసుకుని 20 ఫిబ్రవరి 2014న రాజ్యసభలో విభజన బిల్లును సమర్థించారని ఆయన గుర్తుచేశారు. విభజన బిల్లుకు అనేక సవరణలు ప్రతిపాదించి, వాటిని ఆమోదించచేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అప్పటి ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెంది సవరణలన్నీ ఉపసంహరించుకున్నారని కెవిపి తెలిపారు.‘ఆ రోజు మీరు రాజ్యసభలో చేసిన ప్రసంగాన్ని సీమాంధ్ర ప్రజలంతా టివిల్లో చూశారు. సీమాంధ్రను ఆదుకునేందుకు ఒకే ఒక్కడుగా సీమాంధ్ర ప్రజల హృదయాల్లో మీకు అత్యున్నత స్థానాన్ని కల్పించాయి’అని ఆయన లేఖలో పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి,టిడిపి కూటమి విజయం సాధించిందంటే దానికి కారణం 2014 ఫిబ్రవరి 2న రాజ్యసళో మీరు చేసిన ఉత్తేజపూరిత ప్రసంగమే కారణం అనడంలో అతిశయోక్తిలేదు’అని ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల ప్రత్యేక హోదా, రెవిన్యూ లోటు భర్తీపై సభలో చేసిన ప్రసంగం మరిచిపోయారా అంటూ కెవిపి ప్రశ్నించారు. రాష్ట్రానికి ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారు కానీ ఆయన అప్పట్లో ఆయన చేసిన ప్రకటనకు విలువలేదని ఇప్పటి ప్రభుత్వం చెప్పడంపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘నాడు ప్రతిపక్షంలోనూ, నేడు పాలకపక్షంలోనూ కీలక పాత్ర నిర్వహిస్తున్న మీరు కార్యోన్ముఖులు కావలసిన సమయం ఆసన్నమైంది. ప్రధాన మంత్రి మోదీకి మీకున్న సత్సంబంధాలు వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇప్పించాలి’అని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

చిత్రం కె.వి.పి.రామచంద్రరావు ఎంపి. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు