జాతీయ వార్తలు

ప్రచారంలో నిమగ్నమైన మీరాకుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: రాష్టప్రతి పదవికి పోటీ చేస్తున్న ప్రతిపక్షం అభ్యర్థి మీరా కుమార్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయకముందే ప్రచారం ప్రారంభించారు. మీ అంతరాత్మ సాక్షిగా ఓటు వేయాలని కోరుతూ ఆమె పార్లమెంటు, శాసనసభ్యులకు లేఖలు రాశారు. మీరా కుమార్ మంగళవారం లేదా బుధవారంనాడు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. రామ్‌నాథ్ కోవింద్ మాదిరిగానే మీరాకుమార్ నామినేషన్ పత్రాలను కూడా అట్టహాసంగా దాఖలు చేయాలని ప్రతిపక్షం ఆలోచిస్తోంది. నామినేషన్ దాఖలు చేసేలోగానే ప్రచారం ప్రారంభించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచన మేరకు మీరాకుమార్ ఓటర్లకు లేఖలు రాయడం ప్రారంభించారు. అధికార పక్షం అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు దాదాపు అరవై రెండు శాతం ఓట్ల బలం ఉన్నప్పటికీ మీరాకుమార్ ఏమాత్రం నిరాశకు లోనుకావటం లేదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందనేది చెప్పలేం కాబట్టి విజయావకాశాలు తక్కువగా ఉన్నా పూర్తిశక్తితో ముందుకు సాగాలనే మీరాకుమార్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యూహంలో భాగంగానే ఆమె పార్లమెంటు సభ్యులు, వివిధ రాష్ట్రాల శాసనసభ్యులకు లేఖలు రాశారు. మీ అంతరాత్మ సాక్షిగా ఓటు వేయండి అని ఓటర్లకు రాసిన లేఖలో సూచించినట్లు తెలిసింది. దేశ సమైక్యతకోసం మనమంతా ఐక్యమత్యంతో వ్యవహరించవలసి ఉన్నదని ఆమె లేఖలో సూచించారు. అయితే గతంలో ఒకసారి మినహా మరెప్పుడూ కూడా రాష్టప్రతి పదవికి పోటీచేసిన అధికార పార్టీ అభ్యర్థి ఓటమిపాలు కాలేదు. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం 1969లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవ రెడ్డి ఓడిపోయ స్వతంత్ర అభ్యర్థి వి.వి.గిరి రాష్టప్రతిగా ఎన్నికయ్యారు. ఆఖరు నిమిషంలో నీలం సంజీవరెడ్డితో వివాదం తలెత్తడంతో ఆయన్ని ఓడించేందుకు అంతరాత్మ సాక్షిగా ఓటు వేయాలంటూ ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఎంపీలు, శాసన సభ్యులకు పిలుపు ఇచ్చారు. నీలం సంజీవరెడ్డిని ఓడించేందుకే ఇందిరాగాంధీ ఆంతరాత్మ సాక్షి, ఆత్మప్రబోధం అనే పేరుతో కాంగ్రెస్ ఎంపీలు, శాసనసభ్యుల చేత వి.వి.గిరికి ఓటు వేయించారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి అంతరాత్మ సాక్షిగా ఓటు వేయాలంటూ మీరాకుమార్ ఇచ్చిన పిలుపు ఆశించిన ఫలితాలు ఇచ్చే అవకాశం లేదు.
ఇదిలాఉంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, మీరాకుమార్ మధ్య విమర్శల యుద్ధం ప్రారంభమైంది. మీరాకుమార్ లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న తనను అవమానించారంటూ సుష్మా ఒక వీడియోను ట్వీట్ చేశారు. లోక్‌సభలో తాను ఆరు నిమిషాలు ప్రసంగిస్తే ఈ సమయంలో మీరాకుమార్ అరవైసార్లు తనకు అడ్డం పడ్డారంటూ ఆరోపించారు. లోక్‌సభ స్పీకర్‌గా నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వహించని వారిని మనం రాష్టప్రతిగా ఎన్నుకుంటామా అనే విధంగా సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. సుష్మా చేసిన ఈ ట్వీట్‌ను పలువురు కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. మీరాకుమార్ లోక్‌సభను సమర్థంగా నిర్వహించేందుకే సుష్మాకు అడ్డుపడి ఉంటారంటూ కాంగ్రెస్ నాయకులు ప్రతిట్వీట్లు చేశారు. మీరాకుమార్ రాష్టప్రతి పదవికి సరిపోరనే విధంగా ప్రచారం చేసేందుకు బిజెపి నాయకులు కొందరు ఆమె గతాన్ని తవ్వి ట్వీట్లు చేయటం ప్రారంభించారు. ఢిల్లీలో రెండు ప్రభుత్వ గృహాలను తన గుప్పిట్లో పెట్టుకోవటంతోపాటు దాదాపు రెండుకోట్ల రూపాయల అద్దె బకాయిలను రద్దు చేయించుకున్న మీరాకుమార్ రాష్టప్రతి పదవికి సరిపోతారా? అంటూ ట్వీట్ల యుద్ధం ప్రారంభించారు.