జాతీయ వార్తలు

సెనె్సక్స్ @ 32 వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 13: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పరుగులు తీస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 1.54 శాతానికి తగ్గిపోవడం, రుతు పవనాలు, వస్తు సేవల పన్ను అమలులో సానుకూల ధోరణలు లాంటి సానుకూల సంకేతాల కారణంగా గురువారం దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టించాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 232 పాయింట్లకు పైగా పెరిగి తొలిసారి 32 వేల పాయింట్లను దాటింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 75.60 పాయింట్లు పెరిగి నిన్నటి 9,816 పాయింట్ల రికార్డును చెరిపేసి 9891.79 పాయింట్ల సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకొంది. సెనె్సక్స్ వెయ్యి పాయింట్లు పెరగడానికి కేవలం 33 సెషన్స్ పట్టింది. వడ్డీరేట్లను పెంచే విషయంలో తొందపడబోమన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ సంకేతాలతో ఆసియా, ఐరోపా మార్కెట్లు సైతం లాభాల్లో కొనసాగడం మదుపరులకు ఊతమిచ్చాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో భారీగా కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి. ఐటిసి షేరు 3 శాతానికి పైగా లాభపడింది.