జాతీయ వార్తలు

ఆచూకీ లేని శ్రీకాంత్‌గౌడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: దేశ రాజధానిలో వారం రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన వైద్యుడు శ్రీకాంత్ గౌడ్ (29) ఆచూకీ ఇంతవరకూ లభించలేదు. గత గురువారం అర్ధరాత్రి ప్రీతివిహార్ ప్రాంతంలో ఓలా క్యాబ్ డ్రైవర్ కీడ్నాప్ చేసి ఓలా యజమాన్యాన్ని రూ.5కోట్లు డిమాండ్ చేశాడు. ఢిల్లీ పోలీసులు కేసును నమోదు చేసి 27 మందితో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ పురోగతి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు, స్నేహితులలో ఆందోళన వ్యక్తమవుతోంది. కిడ్నాప్‌కు గురైన శ్రీకాంత్‌ను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్‌కు, ఢిల్లీ పోలీసు కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీకాంత్‌గౌడ్ గత గురువారం విధులు ముగించుకుని అర్ధరాత్రి సమయంలో ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే ఓలా క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేసి ఓలా సిబ్బందికి పోన్ చేసి రూ.5కోట్లు డిమాండ్ చేశాడు. క్యాబ్ డ్రైవర్ పక్కా ప్రణాళికతో కిడ్నాప్ చేయడంతో పోలీసులు ఎలాంటి ఆచూకీ కనిపెట్టలేకపోయారు.