జాతీయ వార్తలు

బెదిరింపులకు భయపడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 13: బిగ్‌బాస్ రియాల్టీషోకు సంబంధించి నమోదైన కేసుపై తమిళ సూపర్‌స్టార్ కమల్‌హసన్ స్పందించారు. హిందువులను అవమానించారంటూ కమల్‌హసన్‌పై హిందూ మక్కల్ కచ్చి (హెచ్‌ఎంకె) కేసు పెట్టింది. విజయ్ టివిలో జూన్ 24 నుంచి కమల్‌హసన్ బిగ్‌బాస్ ప్రసారమవుతోంది. బిగ్‌బాస్‌లో తమిళుల సంస్కృతిని కించపరిచేలా ఉందని హెచ్‌ఎంకె ఆరోపణ. బిగ్‌బాస్‌పై నిషేధం విధించి కమల్‌పై చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కమల్ స్పందించారు. ‘నన్ను అరెస్టు చేయమన్నదే వారి డిమాండ్. అయితే అలాంటి బెదిరింపులకు నేను భయపడను. న్యాయవ్యవస్థపై నాకు విశ్వాసం ఉంది’ అని కమల్ చెప్పారు. దేశంలో న్యాయం వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందన్న కమల్ ‘చట్టమే తనకు రక్ష’ అని పేర్కొన్నారు. పోలీసు కేసులు, ఆరోపణలు అన్నింటినీ చట్టం చూసుకుంటుందని అన్నారు. సామాజిక అంశాల ఇతివృత్తంగా అమీర్‌ఖాన్ చేసిన ‘సత్యమేవ జయతే’ కార్యక్రమం వంటిదాన్ని ఎందుకు చేయకూడదు అన్న ప్రశ్నకు ‘ఆ షో డబ్బు సంపాదించడానికి చేశారు’ అని బదులిచ్చారు. తాను 37 ఏళ్లుగా సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నానని కమల్ అన్నారు. సినిమా అన్నది వినోదం కోసమని దానిపై 28 శాతం జిఎస్‌టి విధించడం తప్పని ఇటీవల ఈ సంచలన నటుడు విమర్శించాడు. జిఎస్‌టిని తీవ్రంగానే వ్యతిరేకించారు. దీంతో దాన్ని 18 శాతానికి తగ్గించారు. ఈ తగ్గింపు సినీ రంగానికి కొంత ఉపశమనమేనని అన్న కమల్ ‘సినిమాఓ కళ, కూల్‌డ్రింక్స్‌ల మాదిరిగా పన్నులు విధించడం సరైందికాదు’ అని అన్నారు.