జాతీయ వార్తలు

అమర్‌నాథ్ దాడిపై వెల్లువెత్తిన నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫగ్వారా (పంజాబ్), జూలై 14: కాశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని జనం ముక్తకంఠంతో నిరసించారు. దాడికి నిరసనగా హిందూ సంస్థలు శుక్రవారం ఇచ్చిన బంద్‌కు అన్ని మతాలవారూ మద్దతు ఇచ్చారు. అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా బంద్ దృష్ట్యా ఇండో-పాక్ బస్సు సర్వీసులను దారిమళ్లించారు. ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. సదా-ఎ- సర్సద్ బస్సు సర్వీసులను దారిమళ్లించారు. ఈ సర్వీసులు ఢిల్లీ- లాహోర్ మధ్య తిరుగుతాయి. కర్తార్‌పూర్- సుభాన్‌పూర్-కపుర్తలా, నూర్‌మహల్- ఫిలౌర్ రూట్, లాహోల్ వెళ్లే బస్సు ఫిలౌర్- నూర్‌మహల్-నకొదర్-కపుర్తలా,కర్తార్‌పూర్‌లకు మళ్లించారు. ఇలా ఉండగా ఫగ్వారాలో బంద్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.