జాతీయ వార్తలు

విజయ్ మాల్యాను హాజరుపరచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి ఇక్కడకు తీసుకువస్తేగాని అతనిపై ఉన్న కోర్టు ధిక్కార కేసుపై విచారణ చేపట్టలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 9వేల కోట్ల బ్యాంక్ లోన్ ఎగవేతలో నిందితుడైన విజయ్ మాల్యాను భారత్ రప్పించడానికి తీసుకుంటున్న చర్యలపై కేంద్రం సమర్పించిన నివేదికను సుప్రీం కోర్టు ధర్మాసనం పరిశీలించింది. జస్టిస్ ఎకె గోయల్, జస్టిస్ యుయు లలిత్‌లతో కూడిన ధర్మాసనానికి ఈమేరకు అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ నివేదికను సమర్పించారు. కోర్టు ధిక్కార కేసులో మాల్యా దోషిగా పేర్కొన్న దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఈ కేసులో తీర్పు వెలువరించనుంది. అయితే మాల్యాను కోర్టులో హాజరు పరచలేకపోతే కేసు విచారించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు గతంలో కూడా మాల్యాను కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విజయ్ మాల్యా భారత్‌కు రాకుండా బ్రిటన్‌లోనే ఉంటున్నారు. ఈ కేసులో శిక్ష విధించేందుకు శుక్రవారం నాటికి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించినా మాల్యా భారత్‌కు రాలేదు. దీంతో శుక్రవారం మాల్యాను బ్రిటన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చేందుకు కేంద్రం చేపట్టిన చర్యలపై అటార్నీ జనరల్ ధర్మాసనానికి ఓ నివేదిక సమర్పించారు.