జాతీయ వార్తలు

ప్రాచ్య దృక్పథానికి మీరే మూలస్తంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: భారత దేశం అనుసరిస్తున్న ప్రాచ్య దృక్పధానికి మైన్మార్ మూల స్తంభం అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ పొరుగు దేశంతో అన్ని విధాలుగా, అన్ని రంగాల్లోనూ ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకునేందుకు గట్టిగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. మైన్మార్ రక్షణ సర్వీసుల కమాండ్ ఇన్ చీఫ్ హంగ్ హ్లియాన్ శుక్రవారం తనను కలుసుకున్న సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్టు పిఎంఓ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా మోదీతో మాట్లాడిన మైన్మార్ సైనిక కమాండర్ ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ద్యైపాక్షిక, రక్షణ సంబంధాలను, భద్రతాపరమైన సహకారాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. భారత-మైన్మార్‌ల సైనిక దళాలు మధ్య సైనిక సహకారం కొనసాగడం పట్ల ప్రధాని అభినందించినట్టు పిఎంఓ ఆ ప్రకటనలో వివరించింది. ఇటీవల అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన మిలిటెంట్ దాడిని మైన్మార్ సైనికాధినేత ఖండించారని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారని అన్నారు.