జాతీయ వార్తలు

రూమ్ నెం.345పై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి చెందిన ఢిల్లీలోని హోటల్ లీలా ప్యాలెస్ రూమ్‌కు సంబంధించి నివేదిక అంజేయాలని కోర్టు ఆదేశించింది. సునంద రూమ్ నెంబర్ 345లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 2014 జనవరిలో ఈ సంఘటన చోటుచేసుకోగా అప్పటి నుంచి ఆ రూమ్ సీల్‌చేసే ఉంది. రూమ్ తెరుచుకోడానికి తమకు అనుమతి ఇవ్వాలంటూ హోటల్ లీలా ప్యాలెస్ యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన కోర్టు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసులును ఆదేశించింది. జూలై 21 నాటికి వివరణ ఇవ్వాలంటూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పంకజ్ శర్మ విజ్ఞప్తి చేశారు. కాగా సునంద పుష్కర్ మృతికి సంబంధించి బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్‌ను బుధవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద అనుమానాస్పద మృతిపై కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరపాలంటూ జూలై 6న సుబ్రహ్మణ్యస్వామి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సంఘటన జరిగిన ఇంతకాలం అయ్యాక ఇప్పుడు పిల్ దాఖలు చేయడమేమిటని హైకోర్టు స్వామిని ప్రశ్నించింది. థరూర్ ఓ పెద్ద రాజకీయ పార్టీ ఎంపీగా ఉన్నారని, కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ జరగదని కోర్టును ఆశ్రయించినట్టు బిజెపి నేత చెప్పారు. దీంతో సునంద పుష్కర కేసు దర్యాప్తు ప్రస్తుత పరిస్థితులపై నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర హోమ్‌మంత్రిత్వశాఖ, సిబిఐ, ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది.