జాతీయ వార్తలు

బిహార్‌లో మరింత ముదిరిన సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూలై 15: బిహార్‌లో రాజకీయ సంక్షోభం మరింతగా ముదురుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శనివారం నగరంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తోపాటుగా ఒక కార్యక్రమానికి హాజరు కావలసిన ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ఆ కార్యక్రమానికి గైరు హాజరుకావడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.
‘వరల్డ్ యూత్ స్కిల్ డే’ సందర్భంగా రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖ నగరంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తోపాటుగా తేజస్వి యాదవ్ కూడా ముఖ్య అతిథిగా హాజరు కావలసి ఉండింది. అయితే ఆయన ఈ కార్యక్రమానికి రాలేదు. వేదికపై ఆహూతులకోసం చేసిన ఏర్పాట్లలో భాగంగా తేజస్వి యాదవ్ కోసం ఓ కుర్చీ వేసి ఆయన నేమ్‌ప్లేట్‌ను కూడా ఉంచారు. అయితే తేజస్వి రాకపోవడంతో మొదట వేదికపై ఉన్న ఆయన నేమ్‌ప్లేట్‌కు ఓ బట్టను కప్పి ఉంచిన జెడి(యు) కార్యకర్తలు ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ నేమ్‌ప్లేట్‌ను పూర్తిగా తొలగించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడుతూ, బిహార్‌లో పెద్ద సంఖ్యలో యువకులున్నారని, వారే మనకు గొప్ప ఆస్తి అని అన్నారు. రాష్ట్భ్రావృద్ధికే కాక దేశాభివృద్ధికి సైతం గణనీయంగా దోహదపడేందుకుగాను యువతలో నైపుణ్యాన్ని మెరుగుపర్చడానికి అనేక చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. బిహార్ యువకులు కష్టపడి పనిచేసే తత్వం కలిగిన వారని, వివిధ రకాల నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు తగిన శిక్షణ ఇచ్చినట్లయితే, వారికి తగిన అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తమకు ఇంగ్లీషులో మాట్లాడడం రాదని, కంప్యూటర్ నైపుణ్యం లేదని, అందుకే తాము రాణించలేకపోతున్నామనే న్యూనతా భావం బిహార్ యువతలో ఉందని, వారిలో ఆ భావనను పోగొట్టడానికి ప్రభుత్వం వారికి ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాట్లాడడంతోపాటుగా కంప్యూటర్ స్కిల్స్‌లో శిక్షణ ఇప్పిస్తోందని నితీశ్ చెప్పారు.

చిత్రం.. ఖాళీగా ఉన్న తేజస్వి యాదవ్ సీటు