జాతీయ వార్తలు

భారతీయ సంతతి మహిళకు అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: కెనడాకు చెందిన భారతీయ సంతతి మహిళ, యూట్యూబ్ స్టార్ లిల్లీ సింగ్ యూనిసెఫ్ గ్లోబల్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. శనివారం ఢిల్లీలో యునిసెఫ్ నిర్వహించిన ‘యూత్ 4చేంజ్’ కార్యక్రమంలో 28ఏళ్ల లిల్లీని అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. మహిళల సాధికారత, బాలల హక్కుల, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయినందుకు లిల్లీ సింగ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ‘సూపర్‌ఉమన్’గా పేరొందిన లిల్లీ బాలల హక్కులపై, మహిళల సాధికారతపై రూపొందించిన వీడియోలను దాదాపు 11.9 మిలియన్ల మంది వీక్షిస్తున్నారు. ఈమె రూపొందించిన వీడియోలు సమాజాన్ని ఆలోచింపజేశాలా, ఉత్తేజపరిచేలా ఉంటాయి. ఇంగ్లీషులోనే కాక, హిందీలోనూ రూపొందించిన వీడియోలు భారత్‌లోనూ ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ సందర్భంగా లిల్లీ మాట్లాడుతూ యునిసెఫ్ కార్యక్రమాలకు తన వంతు ప్రోత్సాహం అందిస్తానని వెల్లడించారు.