జాతీయ వార్తలు

విద్యా రంగాన్ని సాంస్కృతిక విలువలతో అనుసంధానం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: దేశాన్ని పట్టి పీడిస్తున్న వారసత్వ రాజకీయాలు, కులతత్వం, మైనారిటీల బుజ్జగింపు అనే రుగ్మతలను రూపు మాపడానికి, విద్యావిధానంలోని లోపాలను తొలగించడానికి, దేశ విద్యా విధానాన్ని దాని సాంస్కృతిక విలువలతో అనుసంధానం చేయాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. మన విద్యా విధానాన్ని గనుక మన సాంస్కృతిక విలువలతో అనుసంధానం చేసినట్లయితే విద్యా విధానంలోని అన్ని లోపాలను తొలగించగలగడమే కాక మొత్తం విద్యా వ్యవస్థ మరింతగా మెరుగవుతుందని శనివారం ఇకడ బిజెపి సిద్ధాంతకర్త శ్యా ప్రసాద్ ముఖర్జీ ప్రసంగాలపై రూపొందించిన ఒక పుస్తకాన్ని విడుదల చేస్తూ అమిత్ షా అన్నారు. విద్యారంగంలో ముఖర్జీ తీసుకు వచ్చిన మార్పులను ఆయన వివరిస్తూ, ముఖర్జీ ఎంతో ముందుచూపు ఉన్న నాయకుడని, మన సమాజంలోని వౌలిక విలువలతో ముడిపడిన సహజ టాలెంట్‌ను ప్రోత్సహించే విద్యా విధానం కావాలని ఆయన గట్టిగా అభిప్రాయ పడే వారని అన్నారు. ఈ రెండు అంశాలపై దృష్టి పెట్టినట్లయితే స్వాతంత్య్రం సిద్ధించిన తొలి రోజుల్లో అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉండేది కనుక విద్య ఒక ప్రజా ఉద్యమంగా తయారవుతుందని ముఖర్జీ ప్రధానంగా భావించే వారని అమిత్ షా అన్నారు. ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడన్న విషయం తెలిసిందే. ముఖర్జీ పది మంది సభ్యులతో పార్టీని ప్రారంభించారని, అది ఇప్పుడు 11 కోట్ల సభ్యులతో భారీ వటవృక్షంగా ఎదిగిందని అమిత్ షా చెప్పారు.

చిత్రం.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అమిత్‌షా