జాతీయ వార్తలు

సరిహద్దు వ్యాపారంపై ఎన్‌ఐఏ దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: కాశ్మీర్‌లో వేర్పాటువాదులకు సీమాంతర వ్యాపారస్తుల నుంచి ఆర్థికంగా మద్దతు లభిస్తున్నదన్న సమాచారం మేరకు రెవెన్యూ శాఖకు చెందిన కస్టమ్స్, సెంట్రల్ ఎక్స్‌జ్ అధికారుల సహాయ సహకారాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తీసుకోనుంది. కాశ్మీర్ వేర్పాటువాదులకు ప్రధాన ఆర్థిక వనరులు సీమాంతర వ్యాపారులు అందిస్తున్నారని అధికారులు తెలిపారు. ఎన్‌ఐఏ దర్యాప్తునకు సహకరించేందుకు రెవెన్యూ అధికారుల డిప్యుటేషన్‌కు కేంద్రం అనుమతించిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని సలామాబాద్, పూంచ్ జిల్లాలోని చకన్ దా బాద్‌లో జరిగిన వస్తు మార్పిడి వ్యాపారానికి సంబంధించి గత డిసెంబరులో నమోదైన కేసులపై ఎన్‌ఐఏ విచారణ జరుపుతోంది. కాశ్మీర్‌లో కొందరు వేర్పాటువాదులు బినామీ పేరుతో నిర్వహిస్తున్న లావాదేవీలను, ఆస్తులపై విచారణ జరిపేందుకు ఐఆర్‌ఎస్ అధికారుల సహకారాన్ని తీసుకోనున్నట్లు చెప్పారు. సీమాంతర వాణిజ్యానికి సంబంధించిన కేసులను విచారణకు సహకరించేందుకు నాలుగు నెలలపాటు ఎన్‌ఐఏలో డిప్యుటేషన్‌పై పనిచేసేందుకు ఐఆర్‌ఎస్ అధికారుల సేవలు వినియోగించుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. వేర్పాటువాదులకు సీమాంతర వ్యాపారుల నుంచి ఆర్థిక సాయంపై చేసిన దర్యాప్తులో కొన్ని కీలక పత్రాలు, సమాచారం ఎన్‌ఐఎ అధికారులు సేకరించారు. కేజీ 250 నుంచి 300 రూపాయల వరకే ఉండే బాదంపప్పు రూ.600-650గా వ్యాపార లావాదేవీల్లో చూపించడం, ఇంత భారీ వ్యత్సాసం చూపించడం, అలా వచ్చిన డబ్బును ఉగ్రవాదులకు చేరవేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎన్‌ఐఏ విచారణ జరుపుతోంది. సీమాంతర వ్యాపార నిబంధనల ప్రకారం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో పండించిన, తయారు చేసిన వస్తువులను బార్టర్ పద్ధతిలో కాశ్మీర్‌లో మార్పిడి చేసుకోవచ్చు. ఈ జాబితాలో 21 వస్తువులు ఉన్నాయి. ఈ విధంగా చేసే వ్యాపారంలో వచ్చిన డబ్బు వేర్పాటువాదులకు అందుతుందన్న సమాచారం మేరకు ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతోంది.