జాతీయ వార్తలు

నాయుడే సరైన అభ్యర్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: ఉపరాష్టప్రతి పదవికి సీనియర్ నేత వెంకయ్యనాయుడు సరైన అభ్యర్థి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. 68 ఏళ్ల వెంకయ్యనాయుడు రైతు బిడ్డ అని ప్రజాజీవితంలో అపారమైన అనుభవం కలిగిన వారని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారి మన్ననలను పొందిన వారని ప్రధాని ప్రశంసించారు. ‘నేను వెంకయ్యనాయుడుగారిని చాలాకాలంగా చూస్తున్నాను. ఆయన కష్టపడేతత్వం, నిజాయితీ ఉపరాష్టప్రతి పదవికి అన్ని విధాలా సరైన లక్షణాలు’ అని మోదీ ట్వీట్ చేశారు. రాజ్యసభ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించటానికి ఆయన పార్లమెంటరీ అనుభవం తోడ్పడుతుందన్నారు. ఉపరాష్టప్రతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును ప్రకటించిన వెంటనే ప్రధానమంత్రి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబులతోసహా పలు రాష్ట్రాల సిఎంలకు ఫోన్‌లు చేసి సమాచారం ఇచ్చారు. వెంకయ్యకు మద్దతు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.
దక్షిణాది వ్యక్తికి ఇవ్వడం సంతోషం
ఏన్డీయే ఉపరాష్టప్రతి అభ్యర్థిగా దక్షిణాది వ్యక్తిని ఎంపికచేయడం సంతోషంగా ఉందని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత చెప్పారు. ఉపరాష్టప్రతి అభ్యిర్థిగా వెంకయ్యను ఎంపిక చేసిన అనంతరం టిఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కె.కేశవరావు, వినోద్‌కుమార్, కవిత ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం కవిత విలేఖరులతో మాట్లాడుతూ ఉపరాష్టప్రతిగా సరైన వ్యక్తి వెంకయ్య నాయుడని అన్నారు. దక్షిణాది నుంచి బిజెపిలో చిన్న కార్యకర్తగా మొదలైన ఆయన ప్రస్థాన ఉపరాష్టప్రతి అభ్యర్థి వరకు సాగిందని ఆమె పేర్కొన్నారు. ప్రధాని మోదీ రాష్టప్రతి, ఉపరాష్టప్రతి ఏన్డీయే అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరారని వెల్లడించారు.