జాతీయ వార్తలు

కేంద్రం పరిశీలనలో ఏపీకి ప్రత్యేక సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18:కేంద్ర ప్రభు త్వ వివిధ పద్దుల కింద విడుదల చేసిన నిధులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆడిట్ చేసిన లెక్కల వివరాలు సమర్పించిన అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక సాయం విడుదల చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ మేఘవాల్ వెల్లడించారు. 2014 నుంచి ఈ మూడేళ్ల కాలంలో ప్రత్యేక ఆర్థిక సాయం పేరిట వివధ పద్దుల కింద ఏపీకి మొత్తం రూ.6,7 29.50 కోట్లు విడుదల చేసినట్టు ఆయన చెప్పారు.ఏపీకి వివిధ రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసే ఆర్థిక సాయం జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ (జీఎఫ్‌ఆర్)కు లోబడి మాత్ర మే జరుగుతుందని, ఆ విధంగానే గతం లో విడుదల చేసిన నిధుల వ్యయ వివరాలకు సంబంధించిన వినిమయ పత్రాల ఆధారంగానే 2016-17లో వివిధ పద్దుల కింద ఏపీకి నిధులు విడుదల చేసినట్టు వివరించారు. వైఎస్సాఆర్ సిపిఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.32 85.15 కోట్లు ఏపీకి విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సాఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. విశాఖలో 50 పడకల తో సమగ్రమైన ఆయుష్‌ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమో దం తెలిపింది. జాతీయ ఆయుష్ మిషన్(ఎస్‌ఎఎమ్) నెలకొల్పబోయే ఈ ఆస్పత్రి పనులకు గత ఏడాది బడ్జెట్‌లో కేంద్ర కోటి రూపాయిలు విడుదల చేసినట్టు కేంద్రమంత్రి శ్రీపాద యశోనాయక్ వెల్లడించారు.