జాతీయ వార్తలు

మళ్లీ తెగబడ్డ పాక్ సైన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, జూలై 18: జమ్మూ, కాశ్మీర్‌లో అధీన రేఖ వెంబడి పాక్ సైనికుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఒక ఆర్మీ జవానును, మరో బాలికను పొట్టన పెట్టుకున్న పాక్ సైన్యాలు మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి రాజౌరి, పూంఛ్ జిల్లాలో అధీన రేఖ వెంబడి నివాస ప్రాంతాలపై పెద్దఎత్తున మోర్టార్ గుళ్ల వర్షం కురిపించడంతోపాటుగా కాల్పులకు తెగబడ్డాయని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. స్థానికులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు ఇళ్లలోంచి బైటికి రావద్దని సలహా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సమన్వయంకోసం క్షేత్రస్థాయి అధికారులను అక్కడికి పంపించినట్లు రాజౌరి డిప్యూటీ కమిషనర్ షాహిద్ ఇక్బాల్ చౌధరి చెప్పారు. పాక్ సైన్యం శతఘ్ని దాడుల కారణంగా రాజౌరి, పూంఛ్ ప్రాంతంలోని పంజ్‌గ్రైన్, రాజధాని నైకా గ్రామాలకు చెందిన దాదాపు 4500-5000 మందిపై ప్రభావం పడిందని ఆ ప్రతినిధి చెప్పారు. అధీన రేఖ వెంబడి రాజౌరి (్భంబేర్ గలి), పూంచ్ సెక్టార్లలో ఉదయం 6.45 గంటలనుంచి పాక్ సైన్యం ఎలాంటి కవ్వింపూ లేకుండానే తేలికపాటి ఆయుధాలు, ఆటోమేటిక్ ఆయుధాలు, మోర్టార్లతో పెద్ద ఎత్తున విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు ఆ ప్రతినిధి చెప్పారు. ఈ కాల్పులను భారత జవాన్లు గట్టిగా, సమర్థవంతంగా తిప్పికొడుతున్నట్లు కూడా ఆయన చెప్పారు.
విద్యార్థులు టార్గెట్‌గా కాల్పులు
పాక్ సైన్యం మంగళవారం పెద్ద ఎత్తున శతఘ్ని దాడులకు పాల్పడుతున్న కారణంగా రాజౌరి జిల్లాలోని నౌషేరా సెక్టార్‌లో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాదాపు 50 మంది విద్యార్థులు చిక్కుపడి పోయినట్లు అధికారి ఒకరు చెప్పారు. అయితే దగ్గర్లోనే ఉన్న మరో ప్రాథమిక పాఠశాలకు చెందిన 12 మంది చిన్నారులను మాత్రం అధికారులను కాపాడగలిగారు. పాక్ సైన్యం శతఘ్ని దాడుల కారణంగా సేహర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాదాపు 50 మంది విద్యార్థులు చిక్కుపడిపోయినట్లు రాజౌరి డిప్యూటీ కమిషనర్ షాహిద్ ఇక్బాల్ చౌధరి చెప్పారు. ఈ పాఠశాల ఎత్తులో ఉందని, అందువల్ల పిల్లలను అక్కడినుంచి ఖాళీ చేయించడం కష్టంగా మారిందని ఆయన చెప్పారు. అయితే నౌషేరా సెక్టార్‌లోని కడాలి ప్రాథమిక పాఠశాలలో చిక్కుపడిన 12 మంది చిన్నారులను సురక్షితంగా కాపాడగలిగారు. సేహర్ హైస్కూల్లో చిక్కుపడిన విద్యార్థులను తీసుకు రావడానికి కూడా మూడు బులెట్ ప్రూఫ్ వాహనాలను పంపించామని, దాడుల తీవ్రత తగ్గగానే వారిని కూడా కాపాడుతామని చౌధరి చెప్పారు.