జాతీయ వార్తలు

బస్సు లోయలో పడి 28 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, జూలై 20: హిమాచల్ ప్రదేశ్‌లో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 28 మంది మృతి చెందగా, మరో ఎనిమిది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.కిన్నౌర్ జిల్లాలోని రెకోంగ్ పెవోనుంచి సోలాన్‌లోని నౌనికి 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ఒకటి ఇండో-టిబెట్ జాతీయ రహదారిపై రాంపూర్ సమీపంలోని ఖనేరి వద్ద అదుపు తప్ప 500 అడుగుల లోతయిన లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో 18 మంది మగవాళ్లు, 9 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. ప్రమాదానికి కారణాలను తెలుసుకోవడం కోసం మేజిస్ట్రేట్ దర్యాప్తుకు ఆదేశించారు. అయితే ప్రాథమిక విచారణను బట్టి బస్సు టైర్ పేలిపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతి చెందిన 28 మంది మృతదేహాలను వెలికి తీశారని, వారిలో 11 మందిని గుర్తించడం జరిగిందని సిమ్లా డిప్యూటీ కమిషనర్ రోహన్ చంద్ ఠాకూర్ చెప్పారు. తీవ్ర గాయాలయిన నలుగురిని
సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజి (ఐజిఎంసి) ఆస్పత్రిలో చేర్పించగా, మరో నలుగురు ఖనేరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం కింద తలా పది వేల రూపాయలను అందజేశామని ఠాకూర్ చెప్పారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సునీల్ శర్మ సంఘటన స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిఐఎస్‌ఎఫ్ దళం సంఘటన స్థలానికి చేరుకోగా, సున్నీ నుంచి ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన మరోదళాన్ని రాంపూర్‌కు పంపించారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ బస్సు ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

చిత్రం.. లోయలో పడిన బస్సు శకలాలు