జాతీయ వార్తలు

మహారాష్ట్ర, కర్నాటకలో కృష్ణా నీరు దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: కృష్ణా నదిపై చిన్నచిన్న ప్రాజెక్టులు నిర్మించి మహారాష్ట్ర, కర్ణాటక జలదోపిడీ చేసున్నాయని తెలంగాణ ఆరోపించింది. ఈ విషయమై తెలంగాణ తరఫున న్యాయవాది వైద్యనాథన్ మంగళవారం కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదన వినిపించారు. కృష్ణా ఎగువ రాష్ట్రాల జల దోపిడీని అరికట్టేందుకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలని కోరారు. ప్రాజెక్టుల వారీగా కాకుండా ఒకే సారి నీటిని కేటాయించడంతో ఎగువ రాష్ట్రాలు ఇష్టానుసారంగా నీటిని ఉపయోగించుకొంటునయని ఆయన తెలిపారు. మహారాష్ట్ర, కర్నాటక కృష్ణా పరివాహకంలో లేని ప్రాంతాలకు నీటిని మళ్లీస్తూన్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కృష్ణానదీపై ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలన్నారు. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర, కర్నాటక ఇప్పటికే తమ వాదనలు వినిపించాయి. అయితే ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం బుధవారం కూడా వాదన వినిపించి ఆ రెండు రాష్ట్రాలు సాగిస్తున్న జల దోపిడీ గురించి మ్యాపుల ద్వారా వివరించనుంది.