జాతీయ వార్తలు

పది ఔషధ తయారీ సంస్థల లైసెన్సులు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: ఆరు రాష్ట్రాలోని పది ఔషధ ఉత్పత్తిదారుల లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో తెలియజేసింది. లైపోసోమల్ ఆంఫోటెరిసిన్ ఇంజక్షన్‌ను ఉత్పత్తి చేసే పది ఉత్పత్తి సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేయాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సిడిఎస్‌సిఓ) రాష్ట్రాల్లో లైసెన్సులు జారీచేసే అధికారులను గత మార్చి 16న ఆదేశించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ ప్రశ్నోత్తరాల సయమంలో చెప్పారు. సిస్టెమిక్ ఫంగల్ అలర్జీల చికిత్సకు, అలాగే ‘కాలా అజర్’గా పిలవబడే కంటి జబ్బు చికిత్సకోసం ఈ ఇంజక్షన్‌ను ఉపయోగిస్తారని, వీటి తయారీ లైసెన్సులను నిలిపివేయాలని ఐసిఎంఆర్‌కు చెందిన నిపుణుల బృందం సిఫార్సు చేయడంతో దాని ఉత్పత్తి లైసెన్సులను నిలిపివేశారని ఆయన చెప్పారు. డ్రగ్స్, కాస్మొటిక్ చట్టం-1940లోని 26ఎ సెక్షన్ కింద దేశంలో మార్కెట్ అవుతున్న ఈ ఇంజక్షన్‌ను రెగ్యులేట్ చేయాలని, నిపుణుల కమిటీ సూచించిన ప్రమాణాల ఆధారంగా తమ ఉత్పత్తుల నాణ్యత, సేఫ్టీ, సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని ఉత్పత్తిదారులను ఆదేశించాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది.
ఉత్పత్తిదారుల లైసెన్సులను తాము పూర్తిగా రద్దు చేయలేదని, షరతులను నెరవేర్చిన తర్వాత వాటి ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని ఉత్పత్తిదారులకు చెప్పడం జరిగిందని, షరతులను నెరవేర్చేవరకు అలాంటి ఔషధాల లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి చెప్పారు. అంతేకాదు లైపోసోమల్ ఆంఫోటెరిసిన్ ఇంజక్షన్ ఉత్పత్తిల లైసెన్సులను ఎందుకు నిలిపివేయకూడదో మూడు వారాల్లోగా తెలియజేయాలంటూ ఆ పది ఉత్పత్తిదారులకు షోకాజ్ నోటీసులను కూడా జారీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. కాగా, పాఠశాలలకు వంద గజాల పరిధిలో పొగలేని పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు/ ప్రకటనల నిషేధ చట్టం అమలుకు సంబంధించి మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, అన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు.

chitram కేంద్ర మంత్రి శ్రీపాద్ యశో నాయక్