జాతీయ వార్తలు

అవిశ్వాస తీర్మానానికి వెనుకాడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 11: అన్నా డిఎంకె (అమ్మ) పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్‌పై ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని వర్గం తిరుగుబాటు చేసిన నేపథ్యంలో అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె శుక్రవారం పేర్కొంది. అన్నాడిఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్ నియామకం పార్టీ నిబంధనావళికి వ్యతిరేకమని, పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం ఆయనకు లేదని పేర్కొంటూ పళనిస్వామి వర్గం గురువారం ఒక తీర్మానం ఆమోదించిన ఒక రోజు తర్వాత డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ప్రస్తుతం జైల్లో ఉన్న వికె శశికళ పార్టీ చీఫ్‌గా కొనసాగడాన్ని సైతం ముఖ్యమంత్రి వర్గం వ్యతిరేకించిన విష యం తెలిసిందే. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో డిఎంకె ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని తీసుకు వస్తుందా అని విలేఖరులు అడగ్గా, అవసరమైతే తప్పకుండా తీసుకు వస్తామంటూ స్టాలిన్ నర్మగర్భంగా చెప్పారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత శశికళ పార్టీ పగ్గాలు చేపట్టడంపై అప్పటి తాత్కాలిక ముఖ్యమంత్రి ఓ. పన్నీస్ సెల్వం తిరుగుబాటు చేయడంతో శశికళ వర్గం పళనిస్వామిని ఈ ఏడాది ప్రారంభంలో ముఖ్యమంత్రిగా నియమించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో పళనిస్వామి విజయం కూడా సాధించారు. అయితే అధికార అన్నాడిఎంకె పార్టీ పళనిస్వామి, పన్నీర్ సెల్వం, దినకరన్ నేతృత్వంలో మూడు వర్గాలుగా చీలిపోయినందున రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొనిందని, ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కూడా అయిన స్టాలిన్ అన్నారు. వారి కష్టాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇద్దరూ డిల్లీలోనే...
న్యూఢిల్లీ:ఇదిలా ఉండగా, అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు త్వరలోనే విలీనమవుతాయన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి పళనిస్వామి శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అయితే అఖిల భారత మెడికల్ కాలేజి ఎంట్రన్స్ పరీక్ష అయిన నీట్ పరిధినుంచి రాష్ట్రాన్ని మినహాయించాలన్న రాష్ట్రం డిమాండ్ గురించి మాత్రమే తాను ప్రధానితో చర్చించానని పళనిస్వామి విలేఖరులతో చెప్పారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురైతో కలిసి పళనిస్వామి పార్లమెంటు భవనంలోని ప్రధాని కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ నెల 15 నాటికల్లా అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు విలీనమవుతాయంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
పళనిస్వామి కూడా ఢిల్లీలోనే ఉండడంతో ఢిల్లీ కేంద్రంగా వీరిద్దరూ చక్రం తిప్పుతుండవచ్చనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. వీరిద్దరు కూడా శుక్రవారం ఉదయం ఉప రాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. పన్నీర్ సెల్వం కూడా ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.