జాతీయ వార్తలు

విలీన నిర్ణయం అందరిదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: బిజెపితో విలీనానికి సం బంధించిన వ్యవహారంలో తలెత్తిన పరిణామాలపై బిహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీష్‌కుమార్ మరింతగా తన పట్టు బిగించారు. తిరుగుబాటు నాయకుడు శరద్ యాదవ్‌తో రాజీపడే ప్రసక్తి లేదని, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించినంతవరకూ బిజెపితో విలీనం కావాలని నిర్ణయించుకున్నామనీ, అది తానొక్కడే తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేసిన నితీష్‌కుమార్ ‘అందరినీ సంప్రదించి పార్టీ ఆమోదంతోనే బిజెపిలో జెడియులో విలీనం చేశాం. శరద్‌యాదవ్‌కు మరో అభిప్రాయం ఉంటే ఆయన ఎలా వ్యవహరించినా మాకు అభ్యంతరం లేదు’ అని వెల్లడించారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న అనంతరం నితీష్ విలేఖరులతో మాట్లాడారు.
రెండు పార్టీల విలీనం తర్వాత ఆయన ప్రధాని మోదీని కలుసుకోవడం ఇదే మొదటిసారి. అలాగే శరద్ యాదవ్ తిరుగుబాటుకు సంబంధించి నితీష్ ప్రతిస్పందించడం ఇదే మొదటిసారి. రాజ్యసభలో జెడియు నాయకుడుగా ఉన్న శరద్ యాదవ్ ప్రస్తుతం బిహార్‌లో పర్యటిస్తున్నారు. తాను ఇంకా మహా కూటమితోనే ఉన్నానని గురువారం స్పష్టం చేసిన శరద్ యాదవ్, జెడియు తనతోనే ఉందని కూడా ఉద్ఘాటించారు. దానిపైనే నితీష్‌కుమార్ తాజాగా తీవ్ర స్థాయిలో స్పందించారు.