జాతీయ వార్తలు

శరద్‌యాదవ్‌కు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏతో చేతులు కలిపిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మరో అడుగు ముందుకు వేసి శరద్ యాదవ్‌ను రాజ్యసభలో జెడి (యు) పక్ష నేత పదవి నుండి తొలగించారు. జెడి (యు) పార్లమెంటు సభ్యులు శనివారం రాజ్యసభ అధ్యక్షుడు, ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడును కలిసి ఈమేరకు ఒక లేఖను అందజేశారు. శరద్ యాదవ్ స్థానంలో ఆర్‌సిపి సింగ్‌ను రాజ్యసభలో జెడి (యు) పక్ష నాయకుడుగా నియమించినట్లు వారు తమ లేఖలో తెలిపారు. ముఖ్యమంత్రి పదవితోపాటు జెడి (యు) అధ్యక్ష పదవిని కూడా నిర్వహిస్తున్న నితీశ్‌కుమార్ ఈ లేఖ రాయటం గమనార్హం. అయితే రాజ్యసభలో జెడి (యు) పక్ష నాయకత్వం పదవి నుండి శరద్ యాదవ్‌ను తొలగించలేదని, ఆయన స్థానంలో ఆర్‌సిపి సింగ్‌ను ఎన్నుకున్నామని జెడి (యు) నాయకుడు వశిష్టనారాయణ్ తెలిపారు. నితీష్‌కుమార్ బిజెపితో చేతులు కలపటాన్ని విమర్శించటంతోపాటు ఆర్‌జెడి, కాంగ్రెస్‌తో చేతులు కలపటం ద్వారా పార్టీ వ్యతిరేకకార్యకలాపాలకు పాల్పడుతున్నందుకే శరద్ యాదవ్ స్థానంలో సింగ్‌ను ఎన్నుకున్నట్లు నారాయణ్ చెప్పారు. నితీశ్ కుమార్ బిజెపితో చేతులు కలపటాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న
శరద్ యాదవ్ త్వరలోనే సొంత పార్టీని పెట్టుకుంటారని వార్తలు వస్తున్నాయి. జెడి (యు) నితీశ్‌కుమార్ ఒక్కరిదే కాదు తనది కూడా అని చెబుతున్న శరద్ యాదవ్ రెండు,మూడు రోజుల్లో పార్టీని చీలుస్తాడని అంటున్నారు. పార్టీని చీల్చేలోగా ఆయనను రాజ్యసభలో పార్టీ పక్ష నాయకత్వం పదవి నుండి తప్పించాలనే లక్ష్యంతోనే జెడి (యు) ఎంపీలు శనివారం వెంకయ్యనాయుడును కలిసి సింగ్‌ను తమ నాయకుడుగా ఎంపిక చేసుకున్నట్లు ప్రకటించారు.
ఎన్‌డిఏలోకి రండి: అమిత్‌షా
కాగా,బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను ఎన్‌డిఏ కూటమిలో చేరాల్సిందిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆహ్వానించారు. బిహార్‌లో మహాకూటమిని నుంచి వైదొలగిన నితీశ్‌కుమార్ బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.‘శుక్రవారం నితీశ్‌కుమార్‌తో నేను సమావేశమయ్యాను. ఢిల్లీలోని మా నివాసంలోనే ఆయనతో అన్ని విషయాలూ మాట్లాడాను. ఎన్‌డిఏలోకి రమ్మని ఆహ్వానించాను’అని షా స్పష్టం చేశారు. అమిత్‌షా ఆహ్వానానికి జెడి(యు) సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈనెల 19న పాట్నాలో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
జెడి(యు) నితీశ్ ఒక్కరిదే కాదు
కాగా, జెడి(యు) పార్టీ నితీశ్ ఒక్కరిది కాదని, తనకు కూడా చెందినదని శరద్ యాదవ్ అన్నారు. మూడు రోజుల సంవాద్ యాత్ర (ప్రజలతో ముఖాముఖి) చివరి రోజయిన శనివారం ఆయన బిహార్‌లోని మాధేపురలో స్థానిక ప్రజలతో మాట్లాడారు. నితీశ్ కుమార్ మహాకూటమినుంచి బైటికి వచ్చి బిజెపితో చేతులు కలపడంపై తన ఆవేదనను, బాధను ఆయన వారికి వివరించారు. ‘ఇప్పుడు బిహర్‌లో రెండు జెడి(యు)లున్నాయి. ఒకటి సర్కారీ జెడి(యు) అయితే మరోటి జనతా(ప్రజల)కు చెందినది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, నేతలంతా నితీశ్‌తో ఉన్నారు, కార్యకర్తలు, ప్రజలు మాత్రం నాతో ఉన్నారు’ అని ఆయన అన్నారు. కాగా, తనను పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవినుంచి తప్పించడంపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. తాను ఇందిరాగాంధీకే భయపడలేదని, మిగతా వారు తనకు ఓ లెక్క కాదని కూడా ఆయన అన్నారు. ‘వాస్తవాలు మాట్లాడడానికి, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం కోసం నేను ఎవరికీ భయపడలేదు’ అని 70వ దశకంలో విద్యార్థి నాయకుడిగా తాను ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన విషయాన్ని గుర్తు చేస్తూ శరద్ యాదవ్ చెప్పారు.