జాతీయ వార్తలు

అన్నాడిఎంకె వర్గాలు త్వరలోనే విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూరు, ఆగస్టు 12: అధికార అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు- ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పనె్నర్ సెల్వం వర్గాలు- త్వరలో విలీనమవుతాయన్న విశ్వాసాన్ని తమిళనాడుకు చెందిన ఇద్దరు మంత్రులు వ్యక్తం చేశారు. అంతేకాదు, అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేస్తుందన్న నమ్మకాన్ని సైతం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్నదంతా ఇద్దరు అన్నదమ్ముల మధ్య అభిప్రాయా భేదాలేనని, వీటిని త్వరలోనే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని అటవీ శాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ శనివారం కోయంబత్తూరులో చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత కన్న కలలను నెరవేర్చడానికి తమ రెండు వర్గాలు కలిసి కృషి చేస్తాయని మరో మంత్రి సెల్లూర్ ఎల్ రాజు అన్నారు. రెండు వర్గాల విలీనం ప్రక్రియ ఏడు నెలలుగా కొనసాగుతోందని, ఈ రెండు వర్గాలు ఒక్కటయ్యే రోజు ఎంతో దూరం లేదని శ్రీనివాసన్ అన్నారు. అంతేకాదు ప్రస్తుత ప్రభుత్వం అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేస్తుందని కూడా ఆయన అన్నారు. కాగా, శశికళ మేనల్లుడు, టిటివి దినకరన్‌ను ముఖ్యమంత్రి పళనిస్వామి 420గా అభివర్ణించడం గురించి అడగ్గా, పొరబాటుగా నోరుజారి ఆయన అలా అని ఉండవచ్చని, దీనిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని శ్రీనివాసన్ అన్నారు.